కంటి దవాఖాన సూపరిం టెండెంట్‌గా రవిశేఖర్‌రావు | - | Sakshi
Sakshi News home page

కంటి దవాఖాన సూపరిం టెండెంట్‌గా రవిశేఖర్‌రావు

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

కంటి దవాఖాన సూపరిం టెండెంట్‌గా రవిశేఖర్‌రావు 14న జిల్లా స్థాయి ఓపెన్‌ టు ఆల్‌ చెస్‌ పోటీలు రెగ్యులర్‌గా మానిటరింగ్‌ చేయాలి ఆర్టీసీ వరంగల్‌ డిప్యూటీ ఆర్‌ఎంగా కిషన్‌రావు విద్యార్థుల వికాసంలో కళల పాత్ర కీలకం

కాశిబుగ్గ: వరంగల్‌ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ కె.రవిశేఖర్‌రావును నియమించారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ఆప్తాల్మజీ విభాగం (నేత్ర వైద్య విభాగం) హెచ్‌ఓడీగా పనిచేసిన ఆయన బదిలీపై వరంగల్‌కు వచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన డాక్టర్‌ భరత్‌కుమార్‌ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు బదిలీ అయ్యారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 14న కల్నల్‌ సంతోశ్‌బాబు స్మారక ఓపెన్‌ టు ఆల్‌ చదరంగం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహణ కార్యదర్శి కన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను హనుమకొండ రెడ్డి కాలనీలోని మాస్టర్జీ వికాస్‌ హై స్కూల్‌ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అండర్‌–10, 12, 14 బాలబాలికల విభాగం నుంచి ఇద్దరి చొప్పున రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జూలై 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ స్థాయి రాపిడ్‌ రేటింగ్‌ చదరంగ పోటీలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. వివరాలకు మొబైల్‌ 90595 22986 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.

రామన్నపేట: ప్రోగ్రాం అధికారులు తమకు సంబంధించిన ప్రోగ్రాంలను రెగ్యులర్‌గా మానిటరింగ్‌ చేయాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ డాక్టర్‌ ఎస్‌డీ రాంకుమార్‌ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో టీబీ, ఎన్‌సీడీ, మాతా శిశు సంక్షేమం, ఇమ్యునైజేషన్‌, తదితర కార్యక్రమాలపై వైద్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌ఓ రాంకుమార్‌ మాట్లాడుతూ.. లక్ష్య సాధనలో వెనుకబడిన పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, సబ్‌ సెంటర్లపై ప్రత్యేక దృష్టి సారించి, అందుకు కారణాలను గుర్తించాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ మదన్మోహన్‌ రావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రదీప్‌రెడ్డి, డిప్యూటీ సివిల్‌ సర్జన్లు డాక్టర్‌ మహేందర్‌, డాక్టర్‌ మురళి, డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ జ్ఞానేశ్వర్‌, డాక్టర్‌ రుబీన, ఏఓ కోలా రాజేశ్‌, డెమో అశోక్‌ రెడ్డి, విజయలక్ష్మి, డాక్టర్‌ నవీన్‌, డీపీఓ రుక్ముదీన్‌ పాల్గొన్నారు.

హన్మకొండ: టీజీఎస్‌ ఆర్టీసీ వరంగల్‌ డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ (మెకానికల్‌)గా టి.కిషన్‌రావు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేస్తున్న పి.మహేశ్‌ హైదరాబాద్‌కు బదిలీ కాగా, ఆయన స్థానంలో టి.కిషన్‌రావు వచ్చారు. గురువారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. టి.కిషన్‌ రావును డిపో మేనేజర్లు, కార్యాలయం సిబ్బంది కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

విద్యారణ్యపురి: విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని హనుమకొండ జిల్లా విద్యాశాఖ ఏసీజీఈ మధుసూదన్‌రావు అన్నారు. జిల్లాలోని టెక్నికల్‌ టీచర్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ కోర్సు అభ్యర్థులకు 42 రోజులుగా హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్‌ హైస్కూల్‌లో కొనసాగుతున్న శిక్షణ గురువారం ముగిసింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసిన ఛాత్రోపాధ్యాయులు కళానైపుణ్యాలతోపాటుగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, పాఠశాల పరిపాలనా బోధనా పద్ధతులపై పట్టు సాధించాలన్నారు. టీటీసీ కోర్సులో శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసినట్లు కోర్సు కో–ఆర్డినేటర్‌ సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement