వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో గురువారం సాయంత్రం నిర్వహించిన వరంగల్ వారియర్స్ జట్టు పరిచయ కార్యక్రమం స్థానిక క్రికెట్ అభిమానుల్లో నిరాశ మిగిల్చింది. ఇంటర్నేషనల్ బౌలర్, హైదరాబాదీ యువ క్రికెటర్, వరంగల్ వారియర్స్ జట్టు కెప్టెన్ మహ్మద్ సిరాజుద్దీన్ వస్తున్నాడన్న సమాచారంతో ఎంతో ఉత్సాహంతో వచ్చిన అభిమానులు తీరా ఆయన రాకపోవడంతో చిన్నబుచ్చుకున్నారు. సుమారు మూడు గంటల నిరీక్షణ తర్వాత ఆన్‌లైన్ స్క్రీన్‌లో మహ్మద్ సిరాజ్ అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ప్రతిభ గల క్రికెటర్లకు కొదవలేదన్నారు. బీసీసీఐ ఆమోదంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా టీజీ–20 నిర్వహించడం క్రీడాకారులకు చక్కటి అవకాశమని అన్నారు. కాగా, నెట్‌వర్క్ సమస్యతో కేవలం నాలుగు నిమిషాలపాటు అదీ అస్పష్టంగా మాట్లాడడం అభిమానులను తీవ్రంగా కలిచివేసింది.
నెల వేతనం అందజేస్తా: ఎమ్మెల్యే నాయిని
వరంగల్ వారియర్స్ జట్టు పరిచయ వేదికకు ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఫ్రాంచైజ్ యాజ మాన్యంతో కలిసి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజీ–20 టోర్నమెంట్‌లో విజేతలుగా ని లిచివస్తే తన నెల జీతం అందిస్తానని ప్రకటించా రు. సుబేదారిలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో శా శ్వత క్రికెట్ కోచింగ్ క్యాంపు ఏర్పాటుకు కలెక్టర్‌తో మాట్లాడి అనుమతి ఇప్పిస్తానని అన్నారు. ఈ వే దికపై నగర క్రీడా ప్రతిభను జాతీయస్థాయికి తీసుకెళ్లే ఒక రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వరంగల్ వారియర్స్ సహ–యజమానులు వరుణ్ జూపల్లి, ఫణి చిట్నేని, ధీరజ్ ఇందురు, కాంగ్రెస్ యువ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు.
చివరగా ఆన్‌లైన్ స్క్రీన్‌పై
సిరాజ్ పలకరింపు
మూడు గంటలు నిరీక్షించిన
అభిమానులు
నిరుత్సాహంగా ‘మీట్ యువర్
వరంగల్ వారియర్స్’


