నేతన్నల భిక్షాటన
చేనేతలో ప్రభుత్వం అమలు చేస్తున్న టెండర్ విధానం వల్ల ఉపాధి కోల్పోతున్నామని పలువురు నేత కార్మికులు, నాయకులు గురువారం నగరంలోని గోపాలస్వామి గుడి ఏరియాలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. – కాశిబుగ్గ
న్యూశాయంపేట: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్–2 (సీడీఎస్–2026) పరీక్షకు సన్నద్ధమవుతున్న ము స్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్, హనుమకొండ జిల్లాల మైనార్టీ సంక్షేమాధికారులు టి.రమేశ్, మేన శ్రీను గురువారం వేర్వేరు ప్రకటనల్లో తె లిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 15లోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 90590 50062 నంబర్‌లో సంప్రదించాలని, వరంగల్ జిల్లా అభ్యర్థులు హనుమకొండ సుబేదారి షరీఫన్ మసీద్ ఎదుట ఉన్న కార్యాలయంలో, హనుమకొండ జిల్లా అభ్యర్థులు హనుమకలెక్టరేట్ కాంప్లెక్స్ రెండో అంతస్తులో ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.


