టెస్కోతోనే నేత ఉత్పత్తులు కొనాలి | - | Sakshi
Sakshi News home page

టెస్కోతోనే నేత ఉత్పత్తులు కొనాలి

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

మంత్రి తుమ్మలకు మాజీ మేయర్‌ వినతి

కాశిబుగ్గ: చేనేత కార్మికుల ఉపాధి కోసం టెండర్‌ విధానాన్ని రద్దు చేసి, చేనేత ఉత్పత్తులన్నీ టెస్కో ద్వారానే కొనాలని కోరుతూ.. రాష్ట్ర చేనేత జౌళి, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వరంగల్‌ మాజీ మేయర్‌ గుండు సుధారాణి కోరారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. చేనేత ప రిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది చేనేత కార్మికులు జీవిస్తున్నారని, ముఖ్యంగా వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో వేలాది మంది నేత కార్మికుల కుటుంబాలు చేనేత పరిశ్రమపై ఆధారపడి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం చేనేత ఉత్పత్తులపై టెండర్‌ విధా నం అమలు చేయడం, టెస్కో ద్వారా నేరుగా కొనుగోళ్లు లేకపోవడం వల్ల సంఘాల్లో చేనేత ఉత్పత్తుల నిల్వలు పేరుకుపోయాయని, కార్మికులు ఉపాధి కరవై ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈనెల 1 నుంచి వరంగల్‌లో కార్మికులు మగ్గాలను బంద్‌ చేసి దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం టెండర్‌ విధానం కాకుండా గతంలో ఉన్న టెస్కో ద్వారా నేరుగా కొని, ప్రభుత్వ హాస్టళ్లకు పంపిణీ చేసి, కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement