హన్మకొండ: హనుమకొండ సర్కిల్ పరిధిలో విద్యుత్ అత్యవసర పరిస్థితుల్లో వినియోగం కోసం రెండు మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీలు సిద్ధం చేశా రు. వీటిని హనుమకొండ టౌ న్, హనుమకొండ రూరల్ డివిజన్‌కు కేటాయించారు. గురువారం హ నుమకొండ సర్కిల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీటిని హనుమకొండ ఎస్‌ఈ బి.సామ్యానాయక్ డివిజనల్ ఇంజనీర్లకు అందించారు. ఈసందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా అంతరాయాలను అధిగమించేందుకు, వినియోగదారులకు మె రుగైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు ఈ మొబైల్ ట్రాలీలు ఉపయోగపడుతాయన్నారు. విని యోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ సిద్ధంగా ఉందన్నారు. హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబనాయక్, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.


