కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని బోధన, బోధనేతర ఉద్యోగులకు మే నెల వేతనాలు ఇంకా అందలేదు. పెన్షనర్లకు కూడా వేతనాలు రాలేదు. జూన్ నెల మొదలై 12 రోజులైనా ఇంకా వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలవారీ కుటుంబ ఖర్చులు, గృహ, వాహనాల రుణాల ఈఎంఐలు చెల్లించపోవడం అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేతనాల చెల్లింపుల్లో జాప్యం ఇందుకేనా?
కాకతీయ యూనివర్సిటీలో టీచింగ్, నాన్‌టీచింగ్, పెన్షనర్ల కోసం ఏడాదికి అవసరమైన బ్లాక్‌గ్రాంట్‌ను ఈ ఆర్థిక సంవత్స రం బడ్జెట్‌లో కేటాయించారు. అందుకనుగుణంగా అధి కారులు బిల్లుల వివరాలు డీటీఓకు పంపాల్సింటుంది. కొత్తగా వచ్చిన మార్పులకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ ఫైనాన్సి యల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐఎఫ్‌ఎంఎస్)పోర్టల్‌లో నెలవా రీ చెల్లింపుల నిమిత్తం మే నెలకు సంబంధించి బిల్లులు ప్ర తిపాదన వివరాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్య కారణంగా అప్‌లోడ్ కావడం లేదని ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్ చెబుతున్నారు. రెక్టిఫై చేయించేందుకు హైదరా బాద్‌లో యూనివర్సిటీ లైజన్ ఆఫీసర్ అక్కడ సంబంధిత ఆ ర్థిక శాఖ అధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారని తెలి పారు. ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఇప్పటివరకు ఉపయోగిస్తున్న యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కూడా అందజేయాలని ఆర్థికశాఖ సూచించింది. డీటీఓ ద్వారానే నేరుగా బోధన, బోధనేతర ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాలు చె ల్లించాలని యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇ ప్పటికే ఆర్థికశాఖ సూచన మేరకు యూనివర్సిటీకి సంబంధించిన ఉద్యోగుల వివరాలను కూడా ఇంటిగ్రేటెడ్ ఫైనా న్సియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐఎఫ్‌ఎంఎస్)లో నమోదు చేశారు. వేతన బిల్లుల వివరాలు ఐఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ అయితే సైట్ ద్వారానే డీటీఓకు సాఫ్ట్ కాపీగా బిల్లులు వెళ్తాయి. ఆ బిల్లుల వివరాలను హార్డ్‌కాపీగా డీటీఓకు పంపుతామని ఫైనాన్స్ ఆఫీసర్ చెబుతున్నారు. మే నెల వివరాలు డీటీఓకు ఇప్పటివరకు చేరలేదు. దీంతో ప్రభుత్వంనుంచి వేతనాలు, పెన్షన్ విడుదల కావడం లేదని తెలుస్తోంది.
డీడీఓగా ఫైనాన్స్ ఆఫీసర్..
కాకతీయ యూనివర్సిటీకి డ్రాయింగ్ అండ్ డిస్పర్స్‌మెంట్ ఆఫీసర్ (డీడీఓ)గా ఇప్పటివరకు రిజిస్ట్రార్ ఉంటున్నారు. ఇప్పుడు ఒకరు ప్రత్యేకంగా ఉండాల్సింటుందని, ఒక అధికారి పేరును పంపాలని రాష్ట్ర ఆర్థికశాఖ సూచన మేరకు యూనివర్సిటీ ఫైనాన్స్ ఆఫీసర్ పేరును ఇటీవల పంపారు.
మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశం :
కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం
ఆర్థికశాఖ అడిగిన అన్ని వివరాలు యూనివర్సిటీనుంచి పంపాం. మే నెల బిల్లులు ప్రదిపాదించడంలో ఐఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యతో ఆలస్యమైంది. సమస్య పరిష్కారం కాగానే బిల్లులు అప్‌లోడ్ అవుతాయి. ఆ తరువాత మూడు, నాలుగు రోజుల్లో వేతనాలు, పెన్షన్‌లు విడుదలవుతాయని భావిస్తున్నాం.
● కేయూలో బోధన, బోధనేతర ఉద్యోగుల నిరీక్షణ
● పెన్షనర్లదీ అదే దీనస్థితి
● ఐఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్‌కాని
వేతన బిల్లుల వివరాలు
● ఇబ్బందులు పడుతున్నామంటున్న ఉద్యోగులు


