నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ వర్క్స్‌.. పలు రైళ్లు రద్దు | - | Sakshi
Sakshi News home page

నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ వర్క్స్‌.. పలు రైళ్లు రద్దు

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

కాజీపేట రూరల్‌ : సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే ఖరగ్‌పూర్‌ డివిజన్‌ బలేశ్వర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ వర్క్స్‌ కారణంగా కాజీపేట జంక్షన్‌ మీదుగా వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు గురువారం రాత్రి తెలిపారు.

రద్దయిన రైళ్లు..

ఆగస్టు 4వ తేదీన షాలిమార్‌–చర్లపల్లి ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (18045) , ఆగస్టు 6వ తేదీన చర్లపల్లి–షాలిమార్‌ ఈస్ట్‌కోస్ట్‌ (18046) ఎక్స్‌ప్రెస్‌, ఆగస్టు 5వ తేదీన షాలిమార్‌–సికింద్రాబాద్‌ (22849) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌, ఆగస్టు 7వ తేదీన సికింద్రాబాద్‌–షాలిమార్‌ (22850) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు, ఇందుకు ప్ర యాణికులు సహకరించాలని అధికారులు కోరారు.

పార్శిల్లీ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

సెంట్రల్‌ రైల్వేలో ట్రాఫిక్‌ బ్లాక్‌ కారణంగా కాజీపేట మీదుగా ప్రయాణించే భువనేశ్వర్‌–సీఎస్‌టీ ముంబాయి (11020) కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ జూన్‌ 12వ తేదీ నుంచి జులై 6వ తేదీ వరకు దాదర్‌–సీఎస్‌టీ ముంబాయి మధ్య రద్దు చేశామని రైల్వే అధికారులు తెలిపారు.

నేటినుంచి జాతీయస్థాయి నాటిక పోటీలు

మూడు రోజులు ప్రదర్శన..

ఉచిత ప్రవేశం

హన్మకొండ కల్చరల్‌: వరంగల్‌ జిల్లా రంగస్థల కళా కారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే 17వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న ట్లు రంగస్థల కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీ పేట తిరుమలయ్య గురువారం ఒక ప్రకటనలో తె లిపారు. 12, 13, 14వ తేదీల్లో ప్రతీరోజు సాయంత్రం 6గంటలకు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రదర్శనలు జరగనున్నాయన్నారు. మొద టి రోజు శుక్రవారం సా యంత్రం సభా కార్యక్రమం అనంతరం ‘మంచి మనసులు’, ‘నువ్వో సగం నే ను సగం’ నాటిక ప్రదర్శనలు ఉంటాయని, మూడు రోజుల పాటు ప్రదర్శించే నాటికలను నగర ప్రజలు ఉచితంగా తిలకించొచ్చని తెలిపారు. ప్రజలు, కవులు, కళాకారులు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని నాటిక ప్రదర్శనలు తిలకించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో రెవెన్యూ ఉద్యోగి మృతి

వర్ధన్నపేట: విధులకు వెళ్తూ ఓ రెవెన్యూ ఉద్యోగి మృత్యుఒడికి చేరాడు. బైక్‌ అదుపు తప్పడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం వర్ధన్నపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట తహసీల్‌ కార్యాయం చైన్‌మెన్‌ బుంగ వెంకటనర్సు(55) బైక్‌పై తహసీల్దార్‌ కార్యాలయం నుంచి పట్టణానికి వచ్చి విధులు ముగించుకున్నాడు. తిరిగి తహసీల్‌ కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద బైక్‌ అదుపు తప్పింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటనర్సు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement