● వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
ఖిలా వరంగల్: పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలు, అంత్యోదయ భారత్‌కి ఎంతో అవసరమని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. పండిట్ దీన్‌దయాళ్ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కరీమాబాద్‌లో మండల అధ్యక్షులు బోరిగం నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ సంస్కృతిలో అనేక విలువలున్నాయనే విషయాన్ని మరిచిపోయి సమాజంలో మానవత్వం మంటగలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుసుమ సతీష్, కోకన్వీనర్ కందిమల్ల మహేష్, భైరి నాగరాజు, రాజకుమార్, దీన్‌దయాళ్ పాల్గొన్నారు.


