విద్యుదాఘాతంతో
బాలుడి మృతి
నర్సంపేట రూరల్ : విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన నర్సంపేట మండలంలోని మాధన్నపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..మాధన్నపేటకు చెందిన దూడెల సతీష్–జ్యోతి దంపతుల ఏకై క కుమారుడు అభినవ్ (10) నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఉదయం సైకిల్‌పై వెళ్తుండగా స్తంభం పక్కనే ఉన్న ఎర్త్ వైర్‌ను ముట్టుకోవడంతో విద్యుత్ షాక్‌తో కింద పడిపోయాడు. వెంటనే నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు సీపీఆర్ చేసి పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. దీంతో మాధన్నపేట గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ తెలిపారు.


