ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎదుట విజయ సంకేతం చూపుతున్న విద్యార్థినులు
లగేజీతో బస్టాండ్‌కు వెళ్తున్న విద్యార్థి
విద్యారణ్యపురి: ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు (జనరల్ విభాగం) శుక్రవారంతో ముగిశాయి. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి 18,350 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. అందులో 17,931 మంది (98 శాతం) హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. ఇంటర్మీడియట్ జనరల్ పరీక్షలు ముగియడంతో నగరంలో వివిధ హాస్టళ్లలో, గురుకులాల్లో ఉండే విద్యార్థులు ఇంటిబాట పట్టారు.
వరంగల్ జిల్లాలో 163 మంది గైర్హాజరు
కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. చివరి రోజు పరీక్షకు 163 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. జనరల్ కోర్సు మొత్తం విద్యార్థులు 4,736 మందికిగాను 4,605 మంది హాజరు కాగా.. 131 మంది గైర్హాజరయ్యారని, ఒకేషనల్ కోర్సులో మొత్తం విద్యార్థులు 671 మంది కాగా, 639 మంది హాజరు కాగా 32 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.


