కాజీపేట : ఒకప్పుడు పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ కుమారుడు సురేందర్ రావుకు నేడు బుక్కెడు తిండి లేక తల్లడిల్లుతున్నాడు. చిన్ననాటి స్నేహితుడు విజయ్‌కుమార్ మిత్రుత్వాన్ని మరచిపోలేక నిత్యం పంపిస్తున్న ఆహారమే ఆయన ప్రాణాలను కాపాడుతోంది. కాజీపేట మండలంలోని కడిపికొండకు చెందిన కొండపర్తి మనోహర్‌రావు 1958లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. మనోహర్‌రావుకు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు సురేందర్‌రావు ఉన్నారు. కాగా ఇద్దరు కూతుర్లు, కోడలు అనారోగ్యంతో మృతిచెందగా కుమారుడు ఒంటరివాడయ్యాడు. 1996లో సురేందర్‌రావు ఒంటరిగా ఉండడాన్ని గమనించిన పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేరదీసి నాలుగేళ్లు ఆశ్రయం కల్పించారు. ఆ తర్వాత పట్టించుకునే వారు లేక చివరికి కడిపికొండలోని రాజీవ్ గృహకల్ప ఇళ్లకు చేరి జీవనం సాగిస్తున్నాడు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్పందించి సురేందర్‌రావుకు చేయూతనందిస్తారనే ఆశాభావాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.
దివ్యాంగుల పింఛన్‌కు దరఖాస్తు..
ఒకనాడు వందల ఎకరాల భూములున్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి నేడు దివ్యాంగుల పింఛన్‌తో పాటు మనసున్న దాతల చేయూత కోసం ఎదు రు చూస్తున్నాడు. ఎంజీఎం ఆస్పత్రి ఆర్ధోపెడిక్ వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్‌తో దివ్యాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండాపోయింది. మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు పెండింగ్‌లో ఉండటంతో రెండేళ్లుగా పింఛన్ అందుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు.
కె.సురేందర్ రావు,ఎస్‌బీఐ అకౌంట్ నంబర్ 62304832105, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎస్‌బీఐఎన్ 0021300, బ్రాంచి మడికొండకు దాతలు సాయం అందించాలని కోరుతున్నారు.
మాజీ ఎమ్మెల్సీ కుమారుడు
సురేందర్‌రావుకు చేయూత కరువు
రాజీవ్ గృహకల్పలో ఆశ్రయం
సీఎం పట్టించుకోవాలని వేడుకోలు


