క్రీడలతో మానసిక ప్రశాంతత
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: క్రీడలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ రెండో డివిజన్ రెడ్డిపురంలోని టీవీవీఎస్ మైదానంలో కార్పొరేషన్ ఉద్యోగుల క్రీడాపోటీలను ఆదివారం కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. విధి నిర్వహణలో బిజీగా ఉండే ఉద్యోగులు, సిబ్బందికి ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీ యమని పేర్కొన్నారు. కార్పొరేటర్లకు కూడా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తి నింపేలా పోటీలు కొనసాగాలని సూచించారు. విజేతలకు ఈనెల 26న బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్‌లింగం, సీహెచ్‌ఓ రమేశ్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఎంహెచ్‌ఓ రాజేశ్, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి ఉన్నారు.


