సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026
కిక్కిరిసిన
మేడారం
భక్తజనంతో మేడారం పరిసరాలు కిక్కిరిశాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. తల్లులకు ఎదుర్కోళ్లు, యాటపోతులు, ఎత్తు బంగారం, పసుపు కుంకుమ, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ
మొక్కులు చెల్లించేందుకు గద్దెల వద్ద బారులుదీరిన భక్తులు
సమ్మక్క గద్దె వద్ద భక్తులు..
కిక్కిరిసిన జనంతో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం


