మరిన్ని విజయాలు సాధించాలి
హన్మకొండ: అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితో టీజీ ఎన్పీడీసీఎల్ 2026లో మరిన్ని విజయాలు సాధించాలని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్ రెడ్డిని కంపెనీ డైరెక్టర్లు, సీఈలు, సీజీఎంలు, జీఎంలు, అధికారులు, సంఘాలు, అసోసియేషన్లు నాయకులు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ వరదల సమయంలో సిబ్బంది తెగింపు అనిర్వచనీయమన్నారు. వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సి.ఈ లు టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, కె.రాజు చౌహాన్, అశోక్, వెంకటరమణ, అన్నపూర్ణ, సురేందర్, కె.మాధవరావు, ఎన్. శ్రవణ్ కుమార్, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జాయింట్ సెక్రటరీ శ్రీకృష్ణ, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి


