పోలీస్ కమిషనరేట్‌లో నూతన సంవత్సర వేడుకలు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయ ఆవరణలో కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పోలీస్ అధికారులు సిబ్బంది, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, పాఠశాలల విద్యార్థులు, మీడియా ప్రతినిధులు పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు, మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని, లక్ష్యాలను పూర్తిచేయాలని సూచించారు. అలాగే, పోలీస్ అధికారులు, సిబ్బంది సుఖసంతోషాలతో ఉండాలని, తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు. వేడుకల్లో డీసీపీలు రాజమహేంద్ర నాయక్, దార కవిత, ఏఎస్పీ శుభం, ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్ర, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్, బాలస్వామి, సురేశ్‌కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఎస్సైలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


