సంక్షేమం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ
● ఎస్సీ, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీ సుకుంటుందని ఎస్సీ, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కా ర్యాలయంలో బుధవారం భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, పోలీస్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్‌సీఓలు, జిల్లా కోఆర్డినేటర్లు, ఎస్సీ కార్పొరేట్ ఈడీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వసతి గృహాల్లోని విద్యార్థులను తమ పిల్లల్లాగా చూసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా చర్యలు తీసుకుంటామన్నారు.
అన్ని శాఖల సమన్వయంతో..
జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాహుల్‌శర్మ, స్నేహశబరీష్, సత్యశారద మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు, పోలీస్ తదితర శాఖల సమన్వయంతో వసతి గృహాల్లో నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ హన్మంత్‌నాయక్, గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ పోశం, మంత్రి ఓఎస్డీ విజయ్ కుమార్, పీఆర్వో అమృత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


