యువతి ప్రేమను తిరస్కరించిందని..
● మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
పర్వతగిరి: యువతి ప్రేమను తిరస్కరించిందని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై బోగం ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బూర్గుమళ్ల గ్రామ శివారు కొత్తతండాకు చెందిన రామావత్ రాకేశ్ (19) కొద్ది రోజులుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె రాకేశ్ ప్రేమను తిరస్కరించింది. మూడు రోజుల క్రితం మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. స్థానికులు వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కాగా, రాకేశ్ తల్లి ఇటీవల విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. రాకేశ్ మృతితో తండాలో విషాదం నెలకొంది.


