
ప్రజలు కులమతాలకతీతంగా జీవించాలి
కాజీపేట రూరల్ : ప్రజలు కులమతాలకతీతంగా కలిసి ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కాజీపేట దర్గా ఉత్సవాలు ముగింపునకు మంత్రి లక్ష్మణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకాగా నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి ఫకీర్ల విన్యాసాలు తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చారిత్రక కాజీపేట దర్గా దీవెనలతో తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రసిద్ధిగాంచిన కాజీపేట దర్గా ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుగుతాయన్నారు. అనంతరం దర్గా పీఠాధిపతి, తెలంగాణ రాష్ట్ర హజ్‌కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా మాట్లాడుతూ దేశ నలుమూలల నుంచి పీఠాధిపతులు, కులమతాలకతీతంగా భక్తులు తరలొచ్చి దర్గాను దర్శించుకుని అల్లా దీవెనలు పొందారన్నారు.
ఆకట్టుకున్న ఫకీర్ల విన్యాసాలు..
కాజీపేట దర్గా ముగింపు ఉత్సవంలో ఫకీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్, పూణె నుంచి వచ్చిన ఫకీర్లు విన్యాసాలు చేపట్టారు. కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దర్గా పీఠాఽధిపతి అబ్దుల్ రజాక్ బాబామలంగ్ మసుమన్ మదారి, మన్సూర్ బియాబానీ, ముస్లిం మతపెద్దలు, వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇవి.శ్రీనివాస్‌రావు, కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ మోసస్, ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు రామకృష్ణ, మాజీ కా ర్పొరేటర్ అబుబాకర్, సింగారపు రవిప్రసాద్, కందుకూరి పూర్ణచందర్, అరూరి సాంబయ్య, ఎం.డి. ఇంతియాజ్, లెంకలపల్లి శ్రీనివాస్, పోతరబోయిన శ్రీనివాస్, ఎస్.కె.సర్వర్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్
ముగిసిన కాజీపేట దర్గా ఉత్సవాలు
పాల్గొన్న ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి,
ఎమ్మెల్సీ సారయ్య

ప్రజలు కులమతాలకతీతంగా జీవించాలి