
దూరవిద్య డిగ్రీ పరీక్షలు ప్రారంభం
● 8 మంది విద్యార్థులు డీబార్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య డిగ్రీ బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీఎస్సీ ఫైనలియర్ విద్యార్థులకు ఇయర్‌వైజ్‌స్కీం (ఎక్స్, రెగ్యులర్) పరీక్షలు శుక్రవారం 14 కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. వరంగల్ ఏఎస్‌ఎం, ఎల్‌బీ కాలేజీ కేంద్రాల్లో కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన విద్యార్ధులను డీబార్ చేసినట్లు అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ తెలిపారు. ఏఎస్‌ఎం కాలేజీలో ఒకరు, ఎల్‌బీకాలేజీ కేంద్రంలో ఏడుగురు డీబార్ అయ్యారని తెలిపారు. ఇదిలా ఉండగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్‌కాలేజీ కేంద్రాన్ని పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు.
అంతర్జాతీయ
జూడో రెఫరీగా నాగరాజు
మడికొండ: హనుమకొండ జిల్లా మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల జూడో కోచ్ నాగరాజు అంతర్జాతీయ జూడో రెఫరీగా ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ దాసరి ఉమామహేశ్వరి తెలిపారు. ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జోర్ధాన్ రాజధానిలో జూడో రెఫరీ పరీక్షలు జరిగాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోని హనుమకొండ జిల్లా కేంద్రానికి చెందిన నాగరాజు ఒక్కరే ఉత్తీర్ణత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి మొదటిసారి అంతర్జాతీయ జూడో రెఫరీగా ఎంపికై న నాగరాజును ప్రిన్సిపాల్ దాసరి ఉమామహేశ్వరి అభినందించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మడికొండ పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల కార్యదర్శి అలుగ వర్షిణి, మల్టీజోనల్ ఆఫీసర్ అలివేలు, విద్యారాణి ప్రోత్సాహంతోనే ఈవిజయం సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది నాగరాజును అభినందించి సన్మానించారు.
● సీనియార్టీ లిస్టుపై కసరత్తు
● వేకెన్సీల జాబితా వెల్లడి
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా తత్సమాన పీఎస్‌హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పించేందుకు ప్రక్రియ చేపట్టారు. ఈమేరకు ఈ పదోన్నతుల షెడ్యూల్ ప్రకారం.. శుక్రవారం సీనియార్టీ లిస్టును వెల్లడించాల్సి ఉన్నప్పటికీ రాత్రి 9:30 గంటలవరకు వెల్లడించలేదు. ఒక పోస్టుకు ముగ్గురు టీచర్ల చొప్పున సీనియార్టీ జాబితాను వెల్లడించనున్నారు. ఈనెల 23న అఽభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంటుంది. 4న తుది సీనియార్టీ జాబితాను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఈనెల 25న ఎస్జీటీ ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈనెల 26న పదోన్నతుల ఉత్తర్వులు ఇవ్వనున్నారు.
ఏస్‌ఏల వేకెన్సీలు ఇలా..
హనుమకొండ జిల్లాలో 1,431 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు మంజూరీ ఉండగా ప్రస్తుతం 1,237 మంది ఎస్‌ఏలు విధులు నిర్వర్తిస్తున్నారు. 194 వేకన్సీలుగా ఉన్నాయి. 18 జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూల్స్ పోస్టులున్నాయి. 30 వేకెన్సీలు డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌కు 147 ఎస్‌ఏలకు పదో న్నతులు కల్పించనున్నట్లు స మాచారం.

దూరవిద్య డిగ్రీ పరీక్షలు ప్రారంభం

దూరవిద్య డిగ్రీ పరీక్షలు ప్రారంభం