
ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీగా నిధులు..
హన్మకొండ: రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క చొరవతో తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ రాజ్(పీఆర్) శాఖ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీగా నిధులు కేటాయించింది. శుక్రవారం రూ.23.50 కోట్లు కేటాయించి విడుదల చేసింది. ఈ నిధులతో ఇంటిగ్రేడ్, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల భవనాలు నిర్మించనున్నారు. ములుగు జిల్లాలో ఎస్‌ఈ కార్యాలయం నిర్మాణానికి రూ.1.50 కోట్లు, వరంగల్ జిల్లాలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.8 కోట్లు, మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల భవనానికి రూ.2 కోట్లు, ములుగులో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.1.50 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలన మంజూరు చేసింది. అదే విధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల, భూపాలపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయం, హనుమకొండ జిల్లా వేలేరు, దామెర మండల ప్రజా పరిషత్ కార్యాలయం నిర్మా ణం, ములుగు జిల్లా మల్లంపల్లి ఎంపీపీ కార్యాల యం, ములుగు జిల్లా ఏటూరునాగారంలో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణం, మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరులో ఎంపీడీఓ కార్యాలయం నిర్మాణానికి రూ.1.50 కోట్ల చొప్పున కేటాయిస్తూ నిధులు మంజూరు చేసింది.
ఎన్‌హెచ్163 పనులు పూర్తి చేయాలి
హన్మకొండ చౌరస్తా: నేషనల్ హైవే 163 పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో గడ్కరీని కావ్య మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యాదాద్రి–వరంగల్ జాతీయ రహదారి 163 (హైదరాబాద్–భూపాలపట్నం రోడ్) లో పెండింగ్‌లో ఉన్న సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. జాతీయ రహదారి నాలుగు లేన్లుగా విస్తరించినా కొన్ని గ్రామాల వద్ద సర్వీస్ రోడ్లు అనుసంధానం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిడిగొండ, రఘునాథపల్లి, ఛాగల్లు, స్టేషన్‌ఘన్‌పూర్, కరుణాపురం గ్రామాల వద్ద రోడ్డు ఉన్నా జనగామ నుంచి ఈ గ్రామాల మధ్యలో లింక్ లేకపోవడం సమస్యగా మారిందన్నారు. నేరుగా ప్రధాన రహదారి పైకి రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి..సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ కావ్య తెలిపారు.
● పీఆర్ శాఖకు రూ.23.50 కోట్లు
విడుదల చేసిన ప్రభుత్వం
కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన ఎంపీ కావ్య

ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీగా నిధులు..