
దర్గా ఉత్సవాలు షురూ..
భక్తులతో కిక్కిరిసిన కాజీపేట బియాబానీ దర్గా
కాజీపేట: కాజీపేట బియాబానీ దర్గా ఉత్సవాలు షురూ అయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున సందల్ ముగియడంతో ఉర్సు లాంఛనంగా ప్రారంభమైంది. భక్తులతో దర్గా కాజీపేట పరిసర ప్రాంతాలు కిక్కిరిసి పోతున్నాయి. కులమతాలతీతంగా తరలొచ్చి దర్గాను దర్శించుకుని పూలు, చాదర్‌లు సమర్పించి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సాయుధ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా, ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపించకపోవడంతో భక్తులు ప్రైవేట్ వాహనాల్లో ఇబ్బందులు పడుతూ దర్గా చేరుకుంటున్నారు. గురువారం అర్ధరాత్రి దాదాపు లక్షమందికిపైగా భక్తులు దర్గాను దర్శించుకున్నారని నిర్వాహకుల అంచనా. దేశంలోని 25 దర్గాల మత పెద్దలు బియాబానీ దర్గాను సందర్శించి పీఠాధిపతి ఖుస్రూపాషాను ఆశీర్వదించారు.
దర్గాను దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు..
బియాబానీ దర్గాను ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ స్నేహ శబరీష్, సీపీ సన్‌ప్రీత్‌సింగ్, అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్‌ఖాన్, మాజీ కార్పొరేటర్ అబుబక్కర్ తదితరులు దర్శించుకున్నారు.
లక్షమందికిపైగా సందర్శన..
చాదర్‌లు సమర్పించి మొక్కులు..

దర్గా ఉత్సవాలు షురూ..