
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
● వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్
రామన్నపేట: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వరంగల్ డీఐఈఓ శ్రీధర్‌సుమన్ సూచించారు. వరంగల్ ఏవీవీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కొడిమాల శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో బుధవారం ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అధ్యాపకులతో కలిసి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోస్టర్‌ను ఆవి ష్కరించారు. ప్రిన్సిపాల్ భుజేందర్‌రెడ్డి, అధ్యాపకులు అనిత, సంజీవ, శ్రీధర్, స్వప్న, గోపి, సహిస్తా, దేవిశ్రీప్రసాద్, సాకేత్, నవ్య పాల్గొన్నారు.