
సైలెన్సర్లు మారిస్తే క్రిమినల్ చర్యలు
● ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ
వరంగల్ క్రైం: సైలెన్సర్లు మార్చి వాహనం నడిపితే క్రిమినల్ చ ర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమి షనరేట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ వా హనదారులను హెచ్చరించారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్లను కొన్నాళ్ల నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు. ఈక్రమంలో వాటితో రాకెట్ నమూనా తయారు చేసి కమిషనరేట్ కార్యాలయం ఎదుట జంక్షన్‌లో పైలాన్‌ను బుధవారం ట్రాఫిక్ ఏసీపీ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటి వరకు ట్రై సిటీ పరిధిలో 2024లో 1,246 సైలెన్సర్లు, 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 592 అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సీతారెడ్డి పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల
వినియోగాన్ని అరికట్టాలి
● డీఆర్‌ఓ వై.వీ గణేష్
హన్మకొండ అర్బన్: సమాజానికి తీవ్రమైన సమస్యగా మాదకద్రవ్యాల వినియోగం మా రిందని, దానిని అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేష్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో మాదకద్రవ్యాల దుర్విని యోగంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ గణేష్ మాట్లాడుతూ జీవితాన్ని చెడగొట్టే అలవాట్లకు బదులుగా లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా అధికారులతో ప్రతిజ్ఞ చేయించా రు. సమావేశంలో డీడబ్ల్యూఓ జయంతి, డీఆర్డీ ఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ విద్యాలత, మెప్మా అధికారి రజిత రాణి, డీపీఓ లక్ష్మీరమాకాంత్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్
జాయింట్ సెక్రటరీగా రాజ్‌కుమార్
కేయూ క్యాంపస్: తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీగా కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ విభాగం అధిపతి డాక్టర్ చిలువేరు రాజ్‌కుమార్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన సదస్సులో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజ్‌కుమార్ రెండేళ్లపాటు ఆ పదవిలో ఉంటారు.
పూలే సెంటర్ ఫర్ రీసెర్చ్ సోషల్
ట్రాన్స్‌ఫర్మేషన్ డైరెక్టర్‌గా సతీష్
కాకతీయ యూనివర్సిటీ బీసీసెల్, మహాత్మా జ్యోతిరావు పూలే సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్ డైరెక్టర్‌గా జీయాలజీ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.సతీష్‌ను నియమిస్తూ బుధవారం రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న ఆకుతోట శ్రీనివాస్ పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో సతీష్‌ను నియమించారు.
పరిశోధన పత్రాలు,
పోస్టర్ల ప్రజంటేషన్
విద్యారణ్యపురి/కమలాపూర్: చైన్నెలో బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈనెల 11న నిర్వహించిన (ఆర్మ్స్ రీసెర్చ్‌మెంటరింగ్ స్కీమ్) పరిశోధన కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాలనుంచి పలువురు రిసోర్స్‌పర్సన్లు (టీచర్లు) పాల్గొని పరిశోధన పత్రాలు, పోస్టర్ల ప్రజంటేషన్ చేశారు. మూడు ప్రధాన సంస్థలు నిర్వహించిన యాక్షన్ రీసెర్చ్ మల్టీ లింగ్వల్ క్లాస్ రూమ్ పరిశోధన అంశాలపై చర్చించారు. కౌన్సిల్ సమావేశంలో ఇంగ్లిష్, ఫిజిక్స్, మ్యాథ్స్, బయోసైన్స్ రిసోర్స్‌పర్సన్‌లు టి.వెంకటేశ్వర్లు లక్ష్మణ్ వంగర, కె.సంపత్‌కుమార్, ఉప్పుల సుమలత, రోజారాణి, బండారు రమేష్, శశికళాధర్ పాల్గొన్నారు.

సైలెన్సర్లు మారిస్తే క్రిమినల్ చర్యలు

సైలెన్సర్లు మారిస్తే క్రిమినల్ చర్యలు

సైలెన్సర్లు మారిస్తే క్రిమినల్ చర్యలు

సైలెన్సర్లు మారిస్తే క్రిమినల్ చర్యలు