
ఈ ఘటనలో పది మంది యువకుల అరెస్ట్, రిమాండ్
వివరాలు వెల్లడించిన ఏఎప్సీ పండేరిచేతన్ నితిన్
జనగామ రూరల్: ఓ యువతిపై సామూహిక లైంగికదాడికి ప్పాలడిన పది మంది నిందితులను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనగామ పట్టణానికి చెందిన ఓ యువతిపై పది మంది యువకులు మహమ్మద్ ఒవైసీ, ముత్యల పవన్ కుమార్, బౌద్ధుల శివ కుమార్, నూకల రవి, జెట్టి సంజయ్, ఎం.డి అబ్దుల్ ఖయ్యూం, పుస్తకాల సాయి తేజ, ముత్తాడి సుమంత్ రెడ్డి, గుండ సాయి చరణ్ రెడ్డి, ఓరుగంటి సాయిరాం లైంగికదాడికి పాల్పడ్డారు.
జూన్‌లో బాధితురాలిని సదరు యువకులు ప్రేమ, స్నేహం పేరుతో కారులో తీసుకుని జనగామ–సూర్యాపేట రోడ్‌లో గల ‘టీ వరల్డ్’ వెనుక ఉన్న ఒక రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. అందులో ఓ యువకుడు ప్రేమిస్తున్నానని బాధితురాలికి మాయమాటలు చెప్పి గోవాకు తీసుకెళ్లి అక్కడ కూడా పలుమార్లు శారీరకంగా కలిశాడు. ఈ ఘటనపై బాధితురాలి చిన్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం నిందితులు సిద్దిపేట రోడ్డులో ఉన్నారనే సమాచారం మేరకు సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సై భరత్ అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు.
దీంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఏఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువత మత్తు పదార్థాలు సేవించినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర సమయాల్లో డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.