గురిపెట్టి సివిల్ కొట్టారు..
ఖిలా వరంగల్: బాల్యంనుంచే సివిల్స్ ప్రాధాన్యత, ఆ పోస్టులో దక్కే గౌరవాన్ని వరంగల్ రైల్వే స్టేషన్‌లో జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తండ్రి అతని కుమారుడికి వివరించారు. తండ్రి మాటలను శాసనంగా తీసుకున్న ఆ కుమారుడు కష్టపడి చదివాడు. తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 814 ర్యాంకు సాధించాడు. హనుమకొండ రాంనగర్ గోగుల్ నగర్‌కు చెందిన జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ గంగాధరి సుదర్శన్, అరుణ దంపతుల మొదటి కుమారుడు విక్రమ్ కాకతీయ యూనివర్సిటీలో 2016లో బీటెక్ పూర్తి చేశాడు. 2023లో ఐబీ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై నెల్లూరులో ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్–1లో ఫలితాల్లో మెరుగైన ర్యాంకు రావడంతో డీఎస్పీ లేదా అడిటర్ అధికారిగా వచ్చే ఆవకాశం ఉంది. కాగా, ఐబీ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం ఉండగా ఢిల్లీలో లాంగ్‌టర్మ్ సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకున్నారు. వరుసగా రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా విక్రమ్ అధైర్యపడలేదు. మూడో ప్రయత్నంలో ఆలిండియాలో 814వ ర్యాంక్ సాధించి తన సత్తా చాటారు. ఈ మేరకు బుధవారం వరంగల్ రైల్వేస్టేషన్‌లో ఆయన తండ్రి రాజును పలువురు అధికారులు కలిసి అభినందించారు.
సత్తా చాటిన జీఆర్‌పీ కానిస్టేబుల్ కుమారుడు
మూడో ప్రయత్నంలో 814 ర్యాంక్ సాధించిన విక్రమ్
ప్రస్తుతం నెల్లూరులో ఐబీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు
గ్రూప్–1లోనూ ర్యాంకు..


