రేవంత్‌రెడ్డి అధికారం మూడేళ్లే
హన్మకొండ: సీఎం రేవంత్‌రెడ్డి భాషను ప్రజలు ఈసడించుకుంటున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్‌ను ఆధికారంలోకి రానివ్వనని మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి అధి కారంలో ఉండేది మూడేళ్లేనని హితవు పలి కారు. ఆయన బజారు బాష మాట్లాడుతున్నారని తూర్పారబట్టారు. రేవంత్‌రెడ్డి పరాన్నజీవి అయితే, కేసీఆర్ స్వయం ప్రకాశమైన నాయకుడన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనే అజెండా ద్వేషమే తప్ప అభివృద్ధి కాదని రుజువైందని దుయ్యబట్టారు. యూరి యా కోసం రైతుల పడిగాపులు కాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ, హిల్ట్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేయడం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలపై ధ్యాసే లేదని ధ్వజమెత్తారు.
తెలంగాణకు నంబర్ వన్ ద్రోహి..
రాష్ట్రంలో జరుగుతున్న అనేక అరాచకాలను ప్రశ్ని స్తున్న హరీశ్‌రావు, కేటీఆర్‌పై కూడా దిగజారుడు భాషే మాట్లాడుతున్నాడన్నారు. తెలంగాణకు నంబర్‌వన్ ద్రోహి రేవంత్‌రెడ్డి అని అన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, నాయకులు చింతం సదానందం, చెన్నం మధు, జోరిక రమేష్, పులి రజినీకాంత్, శోభన్, నయీముద్దీన్, రామ్మూర్తి, బుద్దె వెంకన్న, వినీల్‌రావు, మూటిక రాజుయాదవ్, గండ్రకోట రాకేశ్‌యాదవ్, చాగంటి రమేశ్, సంపతి రఘు, దేవమ్మ, జేకే, మునుకుంట్ల వెంకటేశ్ పాల్గొన్నారు.
ఆయన భాషను
ఈసడించుకుంటున్న ప్రజలు
శాసన మండలి ప్రతిపక్ష నేత
సిరికొండ మధుసూదనాచారి


