గ్రేటర్ వరంగల్
– మరిన్ని ఫొటోలు : 9లోu
(హనుమకొండ – వరంగల్)
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
7
నగరంలో అంబరాన్నంటిన వేడుకలు ● చర్చిల్లో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు
నగరంలో క్రిస్మస్ వేడుకలు గురువారం అంబరాన్నంటాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని చర్చిలకు ఉదయమే క్రైస్తవులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సెల్ఫీలు దిగి సందడి చేశారు. మతపెద్దలు క్రీస్తు జననం గురించి తెలిపి, క్రీస్తు సందేశం ఇచ్చారు. వరంగల్ క్రిస్టియన్ కాలనీలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండలోని సీబీసీలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా నిర్వాహకులు చర్చిలను అందంగా అలంకరించారు. – సాక్షి, స్టాఫ్‌ఫొటోగ్రాఫర్లు, హన్మకొండ, వరంగల్
ప్రార్థనల అనంతరం హనుమకొండ సీబీసీ నుంచి బయటికి వస్తున్న క్రైస్తవులు (ఇన్‌సెట్‌లో) ప్రసంగిస్తున్న ఫాదర్ నిరంజన్‌బాబు
వరంగల్ జాన్‌పాకలోని మన్న చర్చిలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు, వరంగల్ క్రిస్టియన్ కాలనీలోని సీబీసీలో మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖ, హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు
గ్రేటర్ వరంగల్


