వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య.. | - | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య..

Apr 23 2025 8:05 PM | Updated on Apr 23 2025 8:05 PM

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య..

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య..

వరంగల్‌ క్రైం : తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతోపాటు తనను గతంలో సస్పెండ్‌ చేయించాడనే కోపంతో సామాజిక కార్యకర్త ఛిడం సాయిప్రకాశ్‌ను హత్య చేసిన కేసులో ఓ కానిస్టేబుల్‌తో సహా ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు వరంగల్‌ పోలీసు కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వరంగల్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాపూర్‌ (ఎం) పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న బాషబోయిన శ్రీనివాస్‌ గతంలో వెంకటాపూర్‌ (కె) పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వరిస్తున్న క్రమంలో భూమి విషయంలో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన చింతం నిర్మలతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ విషయంపై నిర్మల భర్తతో కలిసి మృతుడు సాయి ప్రకాశ్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్‌ను సస్పెన్షన్‌ చేశారు.

ఫోన్‌ సమాచారంతో కిడ్నాప్‌.. హత్య

ఈనెల 15వ తేదీన నిందితురాలు నిర్మల, ఆమె భర్తతో కలిసి మృతుడు సాయిప్రకాశ్‌ తన కారులో ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయన్ని నిర్మల.. నిందితుడు శ్రీనివాస్‌కు ఫోన్‌లో తెలియజేయడంతో ప్రణాళిక ప్రకారం కారును వెంబడించి రాత్రి 11.30 గంటల సమయంలో గోపాల్‌పూర్‌లోని బేబిసైనిక్‌ స్కూల్‌ వద్ద కారును ఆటోతో ఢీకొట్టించాడు. అనంతరం సాయి ప్రకాశ్‌ను కారులోనే కిడ్నాప్‌ చేసి హసన్‌పర్తి పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి శాలువతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని హుస్నాబాద్‌ పీఎ స్‌ పరిధిలోని జిల్లేడగడ్డ తండా గ్రామ శివారులోని ఓ బావి లో పడేశారు. అనంతరం వేలేరు మండలం మీదుగా హనుమకొండ ఏషియన్‌ మాల్‌ దగ్గర కారు నిలిపి వెళ్లారు.

నిందితుల అరెస్ట్‌..

ప్రధాన నిందితుడు కానిస్టేబుల్‌ బాషబోయిన శ్రీనివాస్‌తో పాటు ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన డేవిలిసాయి, హనుమకొండకు చెందిన అలోతు అరుణ్‌కుమార్‌ అలియాస్‌ పండు, బాదావత్‌ అఖిల్‌ నాయక్‌, బాదావత్‌ రాజు, వాజేడు వెంకటాపూర్‌కు చెందిన చింతం నిర్మలను అరెస్ట్‌ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన ఓ కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు, పిస్టోల్‌ను స్వాఽధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు.

అధికారులకు అభినందనలు..

సామాజిక కార్యకర్త సాయి ప్రకాశ్‌ హత్య కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్‌ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌, హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి, హనుమకొండ ఇన్‌స్పెక్టర్‌ సతీశ్‌, సిబ్బందిని సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ అభినందించారు.

సాయిప్రకాశ్‌ హత్య కేసులో కానిస్టేబుల్‌తో సహా ఆరుగురి అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement