ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు
రాష్ట్రంలో రైతులు
● మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఎల్కతుర్తి: తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో సాగు, తాగునీటి కష్టాలు మొదలయ్యాని, పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయని, దీనికి కారణం అసమర్థత పాలనేనని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి సమీపంలో ఈనెల 27న నిర్వహించబోయే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణ కు మళ్లీ అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకోరని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. కరెంట్ రాక.. నీళ్లు లేక పంటలు ఎండిపోయి మళ్లీ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కోపాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో బీఆర్ ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. మళ్లీ కేసీ ఆర్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సభా ప్రాంగణ ఏర్పాట్లును పరిశీలించారు. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు లింగపల్లి కిషన్‌రావు, నాగుర్ల వెంకన్న, వాసుదేవరెడ్డి, సతీశ్‌రెడ్డి, నాయకులు చింతం సదానందం, కడారి రాజు, జి.మహేందర్, ఎల్తూరి స్వామి, టి.మహేందర్, నగేశ్, పి.మహేందర్, సమ్మయ్య పాల్గొన్నారు.


