
మీ వద్ద స్టోరీ ఉందా.. నటిస్తా...
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా
‘మీ వద్ద స్టోరీ ఉందా.. వరంగల్‌కు వచ్చి నటిస్తా’ అంటూ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఛలోక్తి విసిరారు. బుధవారం హనుమకొండ సర్క్యూట్ హౌజ్ సమీపంలోని గోకుల్‌నగర్‌లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఫరియా అబ్దుల్లాను ‘వరంగల్‌లో సినిమాలు తీసే ఆలోచన ఉందా’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె స్టేజీపై నృత్యం చేసి అభిమానులను అలరించారు.
– హన్మకొండ