వరంగల్: తక్కువ నీరు, అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో మంగళవారం కరప్రతాలను ఆవిష్కరించి ఆమె మాట్లాడారు. ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు అందిస్తుందని, కోతకు వచ్చిన పంటను కూడా కొనుగోలు చేస్తుందని తెలిపారు. అదనవు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా ఉద్యానశాఖ అధికారి సంగీతలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు 84 దరఖాస్తులు
జిల్లాలో టీజీ ఐపాస్ చట్టం ద్వారా వివిధ శాఖలకు సంబంధించి పరిశ్రమలు నెలకొల్పేందుకు 52 యూనిట్లకు 84 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. అందులో 52 యూనిట్లకు అనుమతులు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిశ్రమల శాఖ జీఎం రమేశ్, అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి..
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన, పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు 41,422 దరఖాస్తులు రాగా.. అందులో 14,899 మంజూరు చేశామని, ఫీజు చెల్లించిన 665 మందికి పత్రాలు అందించినట్లు తెలిపారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టర్ సత్యశారద