
హన్మకొండ అర్బన్: అదనపు జాబితా ఓటర్లతో కలిపి జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లోని మొత్తం ఓటర్ల సంఖ్యను అధికారులు శనివారం వెల్లడించారు. మొత్తం ఓటర్లు 5,08,124 ఉండగా.. వీరిలో పురుషులు 2,49,946. మహిళా ఓటర్లు 2,58,163 కాగా.. ఇతరులు 15 మంది.
పెరిగిన ఓటర్లు 13,945
అదనపు జాబితాతో జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో మొత్తం 13,945 మంది ఓటర్లు పెరిగారు. అక్టోబర్4న ప్రకటించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం మొత్తం 4,94,179 మంది ఓటర్లు ఉండగా.. ప్రసుత్తం వారి సంఖ్య 5,08,124కు చేరింది. పురుషుల్లో 6,356 ఓటర్లు పెరగ్గా మహిళల్లో 7,583 మంది ఓటర్లు పెరిగారు.
● పరకాల నియోజకవర్గంలో మొత్తం 4,382 మంది ఓటర్లు పెరిగారు.
● వరంగల్ పశ్చిమలో 9,563 మంది పెరిగారు.
● జిల్లాలో పురుష ఓటర్ల కన్నా.. మహిళా ఓటర్లు 8,217 మంది అధికంగా ఉన్నారు.
● రెండు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లదే అధిపత్యం.
●వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో థర్డ్ జెండర్ కేటగిరీలో ముగ్గురు ఓటర్లు పెరిగారు.
● ప్రస్తుతం విడుదల చేసిన ఓటర్ల జాబి తా ఫైనల్. జాబితాలో పేర్లున్న ప్రతి ఒక్క రూ ఓటుహక్కును వినియోగించుకోవచ్చు.
అదనపు జాబితాతో పెరిగినవి 13,945
జిల్లాలో మహిళా ఓటర్లే అధికం
Comments
Please login to add a commentAdd a comment