తాగి ఊగుతూ.. ఊగి ఆగతూ.. ఆగి తన్నుకుంటూ.. ఆకతాయిల వీరంగం! | - | Sakshi
Sakshi News home page

తాగుతూ.. ఊగుతూ.. తన్నుకుంటూ.. ఆకతాయిల హల్‌చల్‌..!

Aug 1 2023 1:40 AM | Updated on Aug 1 2023 9:45 AM

- - Sakshi

వరంగల్‌: వరంగల్‌ ఫోర్ట్‌రోడ్డు వాల్‌మార్ట్‌ ఎదురుగా ఓ వైన్‌షాపు ఎదుట సోమవారం పట్టపగలు మద్యం మత్తులో ఆకతాయిలు హల్‌చల్‌ చేశారు. ఇరువురు స్నేహితులు అతిగా మద్యం సేవించి దుర్బాషలాడుతూ పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈఘటనలో ఇరువురు గాయాలపాలయ్యారు. పోలీసులు వస్తున్నారని అక్కడి నుంచి పరారయ్యారు. వీరి ఫైటింగ్‌ చూడడానికి స్థానికులు గుమిగూడారు.

ప్రతి రోజూ ఉర్సు కరీమాబాద్‌, జన్మభూమి జంక్షన్‌, వాల్‌మార్ట్‌ ఎదుట, శంభునిపేట జంక్షన్‌, గవిచర్ల క్రాస్‌రోడ్డు, అండర్‌ బ్రిడ్జి జీపుల అడ్డా, ఇసుక అడ్డా, రైల్వేస్టేషన్‌ శివనగర్‌వైపు, చింతల్‌ ఏరియాల్లో మద్యం మత్తులో ఆకతాయిలు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏరియాల్లో పోలీసులు గస్తీని మరింత ముమ్మరం చేయాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement