కేసీఆర్‌ది ప్రజాకంఠక పాలన : ఈటల | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ది ప్రజాకంఠక పాలన : ఈటల

Apr 1 2023 1:20 AM | Updated on Apr 1 2023 1:20 AM

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌
 - Sakshi

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

గీసుకొండ: సీఎం కేసీఆర్‌ది ప్రజాకంఠక, కుటుంబ వారసత్వ పాలన అని, చాయ్‌ అమ్మే సామాన్యులు ప్రధాని కావొచ్చని నిరూపించిన పార్టీ బీజేపీ అని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ అన్నారు. శుక్రవారం గ్రేటర్‌ వరంగల్‌ నగరం ధర్మారం శివారులో బీజేపీ జిల్లా నూతన కార్యాలయాన్ని వర్చువల్‌గా ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రారంభించారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఈటల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుందనే భరోసా లేకుండా పోయిందన్నారు. టీఎస్‌పీఎస్సీ 12 పరీక్ష పేపర్ల లీకుకు సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్‌ అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు శ్రీనివాస్‌ గౌడ్‌, రాజయ్యయాదవ్‌, నరహరి వేణుగోపాల్‌రెడ్డి, జనార్దన్‌, రాజ మౌళి, సమ్మిరెడ్డి, దేవేందర్‌రెడ్డి, చాడ శ్రీనివాస్‌ రెడ్డి, అశోక్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ధర్మారావు, రాజేశ్వర్‌రావు, భిక్షపతి, విజయ్‌చందర్‌రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement