న్యూస్‌రీల్
అక్రమాలు చేసిన అధికారులను వదిలేసి ఎమ్మెల్సీపై కక్ష సాధింపా! బ్యాలెట్ బాక్సును కాపాడినందుకు జైలుకు పంపడం సిగ్గు చేటు ఎమ్మెల్సీకి జైలులో కనీస భద్రత, సదుపాయాలు కల్పించడంలోనూ కుట్రలు అప్పిరెడ్డిపై కక్ష సాధింపు ఆపాలి.. తప్పుడు కేసులు ఎత్తివేయాలి గుంటూరు జైలులో ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు
అత్యంత హేయం
గుంటూరు
శుక్రవారం శ్రీ 13 శ్రీ నవంబర్ శ్రీ 2026
7
మాచర్ల : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం గురువారం 535.70 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నుంచి 34,558 క్యూసెక్కులు వదులుతున్నారు.
నరసరావుపేట టౌన్: పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో పోలీసులు గురువారం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. ఆర్‌ఐ యువరాజ్ పర్యవేక్షించారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.2327 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతుంది.
గుణదల(విజయవాడ తూర్పు): దక్షిణ భారత దేశంలో అతి పెద్ద రెండవ క్రైస్తవ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గుణదల మేరీమాత ఉత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 9,10,11 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు విజయవాడ కథో లిక పీఠం బిషప్ తెలగతోటి రాజారావు ప్రకటించారు. పుణ్యక్షేత్ర ప్రధానాలయ ఆవరణలో గురువారం గుణదల మాత మహోత్సవాల కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ గుణదల మేరీమాత ఉత్సవాలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు.
శతాబ్ది ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం
కథోలిక క్రైస్తవులు ఎదురు చూస్తున్న శతాబ్ది నూతన ఆయల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని.. ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గుణదల మాత పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఆరేళ్లుగా నిర్మాణంలో ఉన్న నూతన చర్చిని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. మేరిమాత ఉత్సవాల నవదిన ప్రార్థనల్లో భాగంగా ఫిబ్రవరి 2న వైభవోపేతంగా నూతన ఆలయాన్ని ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల బిషప్ లతో పాటు దేశ విదేశాల నుంచి కార్డినల్స్, ఆర్చ్ బిషప్‌లు, వేలాది మంది కథోలిక క్రైస్తవులు హాజరవుతారని తెలిపారు.
రేడియో ప్రసారాలు ప్రారంభం
మేరీమాత పుణ్యక్షేత్ర ఆవరణలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నూతన ఆలయ ప్రతిష్ఠాపన వంటి విశేషాలను శ్రోతలకు చేర వేసే దిశగా నూతనంగా రేడియో , వెబ్ సైట్ ప్రసారాలు ఏర్పాటు చేశామని రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు తెలిపారు.
నగరంపాలెం: ఎన్నికల సమయంలో బ్యాలెట్ బాక్సును అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని జైలుకు పంపడం కూటమి ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలకు పరాకాష్ట అని వైఎస్సార్ సీపీ నాయకులు ఆక్షేపించారు. గుంటూరు సబ్ జైలులో ఉన్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పార్టీ ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కల్పలతారెడ్డి, తోట త్రిమూర్తులు పరామర్శించగా.. వారితోపాటు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, సిపాయి సుబ్రహ్మణ్యం, కేఆర్‌జే భరత్, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రమేష్ యాదవ్, రూహుల్లా, మంగమ్మ, ఇసాక్ బాషా, చంద్రగిరి ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, రామచంద్రారెడ్డి తదితరులు జైలు వద్దకు వెళ్లారు. అనంతరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీల బృందం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను కలిసి లేళ్ల అప్పిరెడ్డిపై నమోదైన తప్పుడు కేసుని విచారించి తగు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. తొలుత జిల్లా జైలు బయట నాయకులు మీడియాతో మాట్లాడారు. జైలులో ఉన్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి చట్టపరంగా దక్కాల్సిన కనీస సౌకర్యాలు, రక్షణ కూడా కల్పించడం లేదని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అక్రమ కేసులో ఇరికించి గుంటూరు సబ్‌జైలులో పెట్టిన నేపథ్యంలో ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చాం. ఇది పూర్తిగా తప్పుడు కేసు. అప్పిరెడ్డిని గుంటూరులో ఉంచడానికి కూడా ఇష్టపడకుండా రాజమండ్రి లేదా నెల్లూరు జైలుకు తరలించాలని జైలు అధికారులు కోర్టును ఆశ్రయించడం మరింత దారుణం. ఒక ఎమ్మెల్సీకి జైలులో కనీస భద్రత, చట్టప్రకారం కల్పించాల్సిన సౌకర్యాలు కూడా కల్పించలేమని అధికారులు చెప్పడం విడ్డూరం. దీనివెనుక లోకేష్, పెమ్మసాని ఒత్తిళ్లు ఉన్నాయి. బ్యాలెట్ బాక్సును వ్యాన్ నుంచి ఎందుకు దించారు, ఎలాంటి భద్రత లేకుండా ఎందుకు బయటకు తీసుకొచ్చారనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. బాక్సును కాపాడేందుకు ప్రయత్నించిన వైఎస్సార్ సీపీ నాయకులకు జైలు శిక్షలు, బాక్సును పగలగొట్టేందుకు ప్రయత్నించిన వారిపై మాత్రం చర్యలు లేకపోవడం కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బయటపెడుతోంది. 57వ వార్డులో జరిగిన బ్యాలెట్ బాక్సు విధ్వంసం, పోలీసుల వ్యవహారశైలిపై కూడా సమగ్ర విచారణ జరపాలని ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం. అప్పిరెడ్డిపై పెట్టిన తప్పుడు కేసును ఎత్తివేయడంతో పాటు, పక్షపాతంగా వ్యవహరిస్తున్న దర్యాప్తు అధికారిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. – అంబటి రాంబాబు, మాజీ మంత్రి
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిది. ఎన్నికల సమయంలో బ్యాలెట్ బాక్సును తీసుకెళ్తున్న వ్యాన్‌ను నల్లపాడు పరిధిలో ఆపి, అందులో నుంచి బాక్సును ఒక సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీసుకురావడాన్ని స్థానికులు, వైఎస్సార్ సీపీ నాయకులు గుర్తించి అడ్డుకున్నారు. బ్యాలెట్ బాక్సును ఎందుకు బయటకు తీస్తున్నారని ప్రశ్నించిన ప్రజలపై పోలీసులు లాఠీచార్జి చేయడం, అక్కడికి వచ్చిన లేళ్ల అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకోవడం దారుణం. ఈ ఘటనలో అసలు తప్పు చేసిన పోలింగ్ సిబ్బందిపై, భద్రత కల్పించడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, అక్రమాలను అడ్డుకున్న వారిపైనే హత్యాయత్నం సహా తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. రాత్రి వరకు ఇది చిన్న గొడవేనని చెప్పిన అధికారులు, తెల్లవారేసరికి హత్యాయత్నం, దోపిడీ వంటి తీవ్రమైన సెక్షన్లు ఎలా పెట్టారో సమాధానం చెప్పాలి. లేళ్ల అప్పిరెడ్డి ఒక ప్రజాప్రతినిధి, ప్రస్తుత ఎమ్మెల్సీ. అయినప్పటికీ ఆయన పట్ల జైలు అధికారులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరం. అప్పిరెడ్డిని జైలులో పెట్టడమే కాకుండా అక్కడ కూడా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేయడం కూటమి ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనం. – తోట త్రిమూర్తులు. ఎమ్మెల్సీ
ఎలాంటి తప్పు చేయని ఒక ఎమ్మెల్సీని అక్రమ కేసులో ఇరికించి రిమాండ్ ఖైదీగా జైలులో పెట్టడం దుర్మార్గం. వెంగళాయపాలెంలో పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సును తరలిస్తున్న వ్యాన్ నుంచి ఒక బాక్సును బయటకు తీసుకురావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. బ్యాలెట్ బాక్సును మార్చే ప్రయత్నం జరుగుతోందనే అనుమానంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు దాన్ని అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. తప్పు చేసిన పోలింగ్ అధికారులను, భద్రత కల్పించని పోలీసులను వదిలేసి, తప్పును ప్రశ్నించిన నాయకులపై కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వ దుర్మార్గపు వైఖరికి నిదర్శనం. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతూ మహిళలను సైతం వేధించిన ప్రభుత్వం ఇప్పుడు ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తోంది. ఇది అత్యంత హేయం.
– వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ


