రైల్వేలైన్‌ భూసమీకరణ ప్రక్రియ వేగవంతం | - | Sakshi
Sakshi News home page

రైల్వేలైన్‌ భూసమీకరణ ప్రక్రియ వేగవంతం

Nov 13 2026 4:05 AM | Updated on Nov 13 2026 4:05 AM

పల్నాడు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా

నరసరావుపేట: నంబూరు–ఎర్రుపాలెం నూతన బ్రాడ్‌గేజ్‌ రైల్వే లైన్‌ నిర్మాణానికి సంబంధించి భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ఆదేశించారు. అమరావతి మండలంలోని ఎండ్రాయి, కార్లపూడి, వైకుంఠపురం గ్రామాల్లో రైల్వేలైన్‌ నిర్మాణానికి అవసరమైన భూముల వివరాలు, రైతుల నుంచి ఫారం–5 సమ్మతి పత్రాల స్వీకరణ, ఫారం పూర్తి చేసిన వివరాలు, ఇంకా పెండింగ్‌లో ఉన్న భూసమీకరణ ప్రక్రియపై కలెక్టరేట్‌ నుంచి గురువారం సమీక్షించారు. అమరావతి మండలంలోని మూడు గ్రామాల్లో మొత్తం 119.6125 ఎకరాల భూమి రైల్వే లైన్‌ నిర్మాణానికి అవసరమవుతోందని, ఇందులో 105.09 ఎకరాలకు సంబంధించి రైతుల నుంచి ఫారం–5 సమ్మతి పత్రాలు స్వీకరించగా, 4.52 ఎకరాలకు సంబంధించి సమ్మతి ప్రక్రియ ఇంకా పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. అదేవిధంగా, 91.83 ఎకరాలకు సంబంధించి ఫారం–5 ప్రక్రియ పూర్తికాగా, మరో 13.315 ఎకరాలకు సంబంధించి ఫారం–5 పూర్తి చేయాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. మొత్తం 256 మంది రైతులకు సంబంధించి 245 మంది రైతుల నుంచి ఫారం–5 సమ్మతి పొందగా, 210 మంది రైతులకు సంబంధించిన ఫారం–5 ప్రక్రియ పూర్తయిందన్నారు. భూసమీకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలు, భూముల సర్వే, మ్యుటేషన్‌, వారసత్వ వివాదాలు, ఇతర న్యాయపరమైన అంశాలను సంబంధిత అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని కలెక్టర్‌ సూచించారు. సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement