బీఈడీ వన్‌టైం పరీక్షలను వెంటనే నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

బీఈడీ వన్‌టైం పరీక్షలను వెంటనే నిర్వహించాలి

Nov 13 2026 4:05 AM | Updated on Nov 13 2026 4:05 AM

వైఎస్సార్‌ సీపీ ఏఎన్‌యూ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పంతగాని రమేష్‌

ఏఎన్‌యూ (పెదకాకాని): ఆరు నెలల క్రితం బీఈడీ వన్‌టైం పరీక్షల నోటిఫికేషన్‌ విడుదల చేసి, నేటి వరకు పరీక్షలు నిర్వహించకపోవడం దారుణమని వైఎస్సార్‌ సీపీ ఏఎన్‌యూ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పంతగాని రమేష్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది మే 5వ తేదీన ఈ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేశారని, జూలై 13వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారని గుర్తుచేశారు. నేటి వరకు పరీక్షలు నిర్వహించకపోవడం విద్యార్థులకు అన్యాయం చేయడమేనని అన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలై, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో బీఈడీ పరీక్షల నిర్వహణలో వర్సిటీ కాలయాపన వల్ల విద్యార్థులు అవకాశాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఈడీ ప్రాక్టికల్స్‌ను షెడ్యూల్‌ కంటే ముందుగానే నిర్వహించిన వర్సిటీ, వన్‌టైం పరీక్షలను ఎందుకు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికై నా పరీక్షలు నిర్వహించి, విద్యార్థులు డీఎస్సీ పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోకుండా చూడాలని ఆయన కోరారు. ఎన్నికల కోడ్‌ సమయంలో హడావుడిగా రెండు సెమిస్టర్ల పరీక్షలను ఒకేసారి ఉదయం, సాయంత్రం నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన అధికారులు.. ఈ పరీక్షలు కూడా అదే తరహాలో నిర్వహించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement