రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Nov 7 2026 2:00 AM | Updated on Nov 7 2026 2:00 AM

మేడికొండూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గుంటూరు– సత్తెనపల్లి జాతీయ రహదారిపై హైదరాబాద్‌ నుంచి గుంటూరు వస్తున్న కారు, ఎదురుగా వస్తున్న టాటా బొలెరో వాహనం ఢీకొన్న ఘటన పాలడుగు క్రాస్‌రోడ్డు సమీపంలో జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న గుంటూరుకు చెందిన మాడగోని శివకృష్ణ(40), బొలెరో డ్రైవర్‌(అస్సాం)కు చెందిన జక్రిల్‌ ఇస్లాం(27) అక్కడికక్కడే మృతి చెందారు. బొలెరో డ్రైవర్‌ అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని సమాచారం. ఘటనపై మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్యాన, మిరప పంటల్లో నష్టంపై అధ్యయనం

నాదెండ్ల: మురసు తుపాను ప్రభావంతో పల్నాడు జిల్లాలో వివిధ రకాలైన ఉద్యాన, మిరప పంటలకు జరిగిన నష్టం వివరాలను శాస్త్రవేత్తల బృందం శుక్రవారం పరిశీలించింది. నాదెండ్ల మండలం తూబాడు, నాదెండ్ల గ్రామాల్లో లాంఫాం ప్రాంతీయ ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి నాగేంద్రరెడ్డి, డాక్టర్‌ గంగాధరరావు, ఉద్యాన శాఖాధికారి శ్రీలక్ష్మితో కలిసి పరిశీలించారు. వెదురు కర్రలతో నిర్మించిన కూరగాయల పందిళ్లు, అరటి, నిమ్మ తోటలు దెబ్బతిన్న రైతులతో మాట్లాడారు. రైతులకు పలు రకాల సూచనలు చేశారు. జిల్లా ఉద్యాన శాఖాధికారి ఐ వెంకట్రావు మాట్లాడుతూ తుపాను వలన పంటలు నష్టపోయిన రైతులకు, ఉద్యాన పంటలు సాగు చేసుకునేందుకు పలు రాయితీలు అమల్లో ఉన్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement