ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు | - | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు

Nov 7 2026 2:00 AM | Updated on Nov 7 2026 2:00 AM

మహిళ మృతి, మరో ఇద్దరికి గాయాలు

మంగళగిరి రూరల్‌: మండల పరిధిలోని చినకాకాని వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళగిరి నుంచి నంబూరు వైపు వెళ్తున్న స్కూటీని విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు ఢీకొంది. స్కూటీ మీద ఉన్న వారు క్రిందపడి పోయారు. ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం ప్రకారం.. నంబూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అతని భార్య స్వాతిలు కుమారుడు వైద్యం నిమిత్తం మంగళగిరిలోని ఎయిమ్స్‌కు వచ్చారు. తిరిగి వీరు సాయంత్రం నాలుగు గంటల సమయంలో నంబూరు వెళ్తుండగా చినకాకాని గ్రామం సమాధులతోట వద్ద విజయవాడ నుంచి అతివేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న కొండమడుగుల స్వాతి (42)అక్కడికక్కడే మృతి చెందింది. స్కూటీపై ప్రయాణిస్తున్న శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు సమిత్‌రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సమీపంలో ఉన్న ఎన్నారై హాస్పటల్‌కి చికిత్స నిమిత్తం తరలించారు. కారులో ఉన్న నలుగురు యువకులు గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్ల ప్రాంతానికి చెందినవారని, మంగళగిరి సమీపంలోని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో బీబీఏ రెండవ సంవత్సరం చదువుతున్నట్లు సమచారం. కొండమడుగుల స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. పోలీస్‌ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలియజేస్తున్నారు.

కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య

తెనాలి రూరల్‌: కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలి సుందరయ్య నగర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. మన్యం జిల్లాకు చెందిన హరికృష్ణ(34) కుటుంబ కలహాల నేపథ్యంలో తెనాలి సుందరయ్య నగర్‌లో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. త్రీ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement