వరదలో కొట్టుకుపోయిన హోంగార్డు | - | Sakshi
Sakshi News home page

వరదలో కొట్టుకుపోయిన హోంగార్డు

Nov 7 2026 2:00 AM | Updated on Nov 7 2026 2:00 AM

తాడికొండ: మురసు తుపాను కారణంగా వచ్చిన వరదలో తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హోంగార్డు ఘట్టమనేని సుబ్బారావు (45) కొట్టుకుపోయాడు. అతని మృతదేహం శుక్రవారం ప్రత్యక్షమైంది. పెదపరిమి గ్రామానికి చెందిన సుబ్బారావు ఈ నెల 03వ తేదీన తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు ముగించుకొని రాత్రి సమయంలో తిరిగి వస్తుండగా వరద నీటిలో కొట్టుకొని పోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కోటేళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాత్రివేళ ఉప్పొంగిన వరద నీరు పెదపరిమి శివారులో ఆయనను నెట్టివేసి ఉంటుందని భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం సమీప పత్తి పొలంలో గుర్తు తెలియని మృతదేహం ఉందంటూ వచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెళ్లి చూడగా సుబ్బారావుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనం ఆచూకీ ఇంకా లభించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement