ఎన్‌హెచ్‌ఎం బృందం సందర్శన | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ఎం బృందం సందర్శన

Nov 6 2026 2:38 AM | Updated on Nov 6 2026 2:38 AM

ప్రత్యేక బృందాలతో విద్యుత్‌ పునరుద్ధరణ ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పి.పుల్లారెడ్డి పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

తెనాలిఅర్బన్‌: నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ రాష్ట్ర బృందం గురువారం తెనాలి జిల్లా వైద్యశాలను సందర్శించింది. ఎన్‌హెచ్‌ఎం రాష్ట్ర ప్రోగ్రాంమేనేజర్‌, వైద్య ఆరోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జె.విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ పి.గీతా పద్మజ, స్టేట్‌ రాష్ట్ర క్వాలిటీ కన్సల్‌టెంట్‌ జ్యోతి, డాక్టర్‌ స్టేఫీ గ్రేస్‌లు జిల్లా వైద్యశాలలోని ఎస్‌ఎంసీయూ, డైక్‌, ఎన్‌సీడీ, నేషనల్‌ మెంటల్‌హెల్త్‌ ప్రోగ్రాం, డయాలసిస్‌ విభాగాలను పరిశీలించారు. అక్కడ అందుతున్న వైద్యసేవలపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులతో మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సౌభాగ్యవాణి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ అన్నపూర్ణ, డీపీఎంవో డాక్టర్‌ సుజాత, డీపీవో డాక్టర్‌ సైమన్‌, ఆర్‌ఎంవోలు డాక్టర్‌ మల్లికార్జునరావు, డాక్టర్‌ మంజూష, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ రాజేశ్వరి, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

చిలకలూరిపేట: ప్రత్యేక బృందాలను రప్పించి విద్యుత్‌ పునరుద్ధరణకు మరమ్మతు పనులు నిర్వహిస్తున్నట్లు ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పి.పుల్లారెడ్డి చెప్పారు. తుపాను నేపథ్యంలో చిలకలూరిపేట పట్టణంతోపాటు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో భారీగా విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడం, తీగలు తెగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం స్థానిక విద్యుత్‌ అధికారులతో కలసి పట్టణంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు పనులను సీఎండీ పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాశం, బాపట్ల జిల్లాలతో పాటు పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఎక్కువగా విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడం, చెట్లు పడి విద్యుత్‌ తీగలు తెగిపోవడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో సమస్య ఉన్న అన్ని ప్రాంతాలలో ప్రత్యేక బృందాలను పిలిపించి మరమ్మతు పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే చిలకలూరిపేటలో 200 మంది సిబ్బందితో మరమ్మతు పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం రాత్రికి వీలైనంత మేరకు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. సరఫర పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్‌ ఎస్‌ఈ డి.సుధాకర్‌, ఈఈ వై.ఏడుకొండలు, ఏడీఈ టి.భార్గవి, ఏఈ పి.కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు రూరల్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ జిల్లాలో ప్రశాంతంగా సాగిందని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సీఎం సాయికాంత్‌వర్మ తెలిపారు. గురువారం గుంటూరు రూరల్‌ మండలం లాలుపురం గ్రామంలో పోలింగ్‌ సరళిని ఆయన పరిశీలించారు. ఓటర్లతో, పోలింగ్‌ సిబ్బందితో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 724 కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహించామని చెప్పారు. 13 జెడ్పీటీసీ స్థానాలకు, 193 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోందని వివరించారు. ఓటర్లందరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయి బందోబస్తు, వసతులు కల్పించామన్నారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement