ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి

Oct 24 2026 5:41 AM | Updated on Oct 24 2026 5:41 AM

తాడేపల్లి రూరల్‌: ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసే ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డి రమాదేవి డిమాండ్‌ చేశారు. తాడేపల్లి రూరల్‌ మండలం వడ్డేశ్వరంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు, కార్మిక, మహిళ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. రమాదేవి మాట్లాడుతూ సర్‌ ప్రక్రియను రద్దు చేయాలని, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున యువత, ప్రజా సంఘాలు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నాయని అన్నారు. సర్‌ ప్రక్రియతో నిర్దాక్షిణ్యంగా 13 కోట్ల ఓట్లను తొలగించడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్నా శివశంకరరావు, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వంకాయలపాటి శివ నాగరాణి, కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు అప్పలస్వామి, సీఐటీయూ నాయకులు నాగేశ్వరరావు, బూరుగ వెంకటేశ్వరరావు, పల్లె కృష్ణ, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, రైతు సంఘం నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, వై కేశవరావు, కాజా వెంకటేశ్వరరావు, రైతు సంఘం రాజధాని నాయకులు ఎస్‌కే ఎర్ర ఫీర్‌, కొర్రపోలు ఈశ్వర్‌రెడ్డి, భక్తి రెడ్డి, వీరాస్వామి, గైరబోయిన నాగేశ్వరరావు, ఐద్వా నాయకురాలు జి అమలశ్రీ, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

వడ్డేశ్వరంలో ప్రజా సంఘాల నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement