నెహ్రూనగర్: తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరు మరోసారి భగ్గుమన్నాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే దళితుల మధ్య తీవ్ర విభేదాలు సష్టించి చిచ్చుపెడుతున్నారని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. 72వ డివిజన్ వార్డు ఎస్సీ జనరల్ అభ్యర్థికి రిజర్వ్ అయింది. అయితే ఈ వార్డుకు అభ్యర్థి ఎంపికకు సంబంధించి చోటుచేసుకున్న ‘బీ–ఫారం’ వివాదం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
72వ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా ముందుగా యరగ్రుంట్ల ఆనంద్‌కు అధిష్టానం బీ–ఫారం కేటాయించింది. నిబంధనల ప్రకారం ఆయన మధ్యాహ్నం 2 గంటల లోపే ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మీ ప్రసాద్‌కు తన బీ–ఫారాన్ని అధికారికంగా అందజేశారు. అయితే, నామినేషన్ గడువు ముగిసే సమయానికి (మధ్యాహ్నం 3 గంటలకు) వేరే డివిజన్‌కు చెందిన విజయ్‌కిరణ్‌కు కుడా 72వ వార్డు తరఫున పార్టీ బీ–ఫారం ఇవ్వడం తీవ్ర దుమారానికి కారణమైంది.
ఈ అక్రమ చర్యను ఆనంద్ వర్గం తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడ ఇరువర్గాల మధ్య పెద్దఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా, ఆనంద్ ను బయటికి పంపించి.. విజయ్ కుమార్‌ను లోపలే ఉంచుతున్నారని ఆనంద్ వర్గీయులు ఆరోపించారు. విజయ్‌కిరణ్‌కు పోలీసులు పూర్తిగా సహకరించారని ఆనంద్ వర్గీయులు తీవ్ర ఆరోపణలు చేశారు.
విజయ్‌కిరణ్‌కు టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు కొందరు ముఖ్య నేతలతో ఉన్న సంబంధాలతో ఎమ్మెల్యేపై ఒత్తిడి తెచ్చి అనైతికంగా బీఫారం తెచ్చుకున్నారని ఆనంద్ వర్గం నిప్పులు చెరిగింది. మొదటినుంచీ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన స్థానికులను పక్కనపెట్టి, ఇతర డివిజన్లలో పలుకుబడి ఉన్నవారికి ఎలా బీఫారం కేటాయిస్తారంటూ స్థానిక కార్యకర్తలు, ఆనంద్ మద్దతుదారులు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై 72, 73, 74 ఆర్‌ఓ లక్ష్మీ ప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా విజయ్ కుమార్ మూడు గంటల తర్వాత బీ ఫారం ఇచ్చేందుకు ప్రయత్నించాడు.. సమయం ముగిసిపోవడంతో తాము తీసుకోలేదని చెప్పారు.
గోడ దూకి.. కిటికీలోంచి విసిరేసి!
నెహ్రూనగర్ వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయం గేట్లను నిబంధనల ప్రకారం అధికారులు మధ్యాహ్నం 3 గంటలకే మూసివేశారు. సమయం ముగిసినప్పటికీ, విజయ్‌కిరణ్ అక్కడికి చేరుకుని నానా హంగామా సష్టించారు. ఆనంద్ వర్గీయులు అడ్డుకున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా, వాటర్ ట్యాంకుల గోడ దూకి లోపలికి ప్రవేశించారు. సమయం దాటిపోయిందని ఆర్వో స్పష్టం చేసినప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా, కార్యాలయం కిటికీలోంచి లోపలికి బీ–ఫారం విసిరేశారు.
● 72వ డివిజన్‌లో ‘బీ–ఫామ్’ రగడ
● గోడ దూకి మరీ బీఫామ్ ఇచ్చిన
టీడీపీ మరో అభ్యర్థి
● సమయం ముగిసినా కిటికీలోంచి
విసిరిన టీడీపీ నేత విజయ్‌కిరణ్
● రోడ్డెక్కిన మొదట బీఫామ్ అందుకున్న
ఆనంద్ వర్గం
అసలేం జరిగింది?
పోలీసుల సహకారంతోనే అక్రమాలు?
ఎమ్మెల్యే తీరుపై భగ్గు