విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై చర్యలు

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

గుంటూరు వెస్ట్‌: మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఒకే సిబ్బందిని వినియోగించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సి.యం.సాయికాంత్‌ వర్మ స్పష్టం చేశారు. జిల్లాలో అందుబాటులో ఉన్న సిబ్బంది సేవలు మూడు ఎన్నికలకు వినియోగిస్తామన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్‌న్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల విధులకు గైర్హాజరు అయ్యే ఉద్యోగుల పట్ల ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులను సస్పెన్షన్‌ చేస్తామని హెచ్చరించారు. సున్నిత, అతి సున్నిత పోలింగ్‌ కేంద్రాలపై పూర్తి స్పష్టత ఉండాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల రూట్‌లపై పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. రిసెప్షన్‌ కేంద్రాలు, కౌంటింగ్‌ కేంద్రాలు రెవెన్యూ డివిజనల్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. బ్యాలెట్‌ పెట్టెలను పోలింగ్‌ కేంద్రాల వారీగా స్టిక్కర్లు అతికించాలన్నారు. ప్రవర్తనా నియమావళి పాటించాలని, సింగిల్‌ డెస్క్‌ను అనుమతులకు ప్రారంభించాలని ఆదేశించారు. ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. వీడియో కాన్ఫరెనన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, జీఎంసీ కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.ఎస్‌.కె. ఖాజావలి, అదనపు ఎస్పీ జి.వి.రమణ మూర్తి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, డీపీఓ బి.వి.నాగసాయికుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement