రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ దుర్మరణం

Oct 18 2026 2:12 AM | Updated on Oct 18 2026 2:12 AM

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ దుర్మరణం

తెనాలి రూరల్‌: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఆర్టీసీ డ్రైవరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొల్లిపర మండలం శివలూరు గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ కట్టెబోయిన శ్రీనివాసరావు(47) శనివారం విధి నిర్వహణ నిమిత్తం బైక్‌పై తెనాలి బయలుదేరాడు. అతడి బైక్‌ వెనుక అదే గ్రామానికి చెందిన మండగిరి నాగమల్లేశ్వరరావు ఉన్నారు. బైక్‌ పట్టణ టు టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వైవీఆర్‌ కాలనీకి చేరుకోగానే వేగంగా ఎదురుగా వస్తున్న మరో బైక్‌ ఢీకొంది. ప్రమాదంలో శ్రీనివాసరావు, నాగమల్లేశ్వరరావులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలపాలైన నాగమల్లేశ్వరరావును మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు తరలించారు. పట్టణ టు టౌన్‌ పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ప్రమాదానికి కారణమైన మరో బైక్‌పై ఉన్న యువకులు గాయాలతో వైద్యశాలలో చేరినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement