బాక్సింగ్‌లో గుంటూరు క్రీడాకారుల పతకాల పంట | - | Sakshi
Sakshi News home page

బాక్సింగ్‌లో గుంటూరు క్రీడాకారుల పతకాల పంట

Oct 17 2026 6:12 AM | Updated on Oct 17 2026 6:12 AM

బాక్సింగ్‌లో గుంటూరు క్రీడాకారుల పతకాల పంట

విజేతలకు వేద సీడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తులసి ధర్మచరణ్‌ అభినందనలు క్రీడాకారులకు ఆర్థిక సాయం అందజేత

కొరిటెపాడు(గుంటూరు): రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ బాక్సింగ్‌ పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. అండర్‌–14, 1ండర్‌–17 విభాగాల్లో స్వర్ణ, కాంస్య పతకాలు సాధించి జిల్లా కీర్తిని చాటారు. పతక విజేతలను శుక్రవారం వేద సీడ్స్‌ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తులసి ధర్మచరణ్‌ అభినందించి, ఆర్థిక సహాయం అందజేశారు. అండర్‌–14 బాలుర విభాగంలో సాయి శశాంక్‌ రావణ్‌ 48–50 కిలోల బరువు విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. అండర్‌–17 బాలికల విభాగంలో కె.లాస్య 66–70 కిలోలు, ఎస్‌.వర్షిణి 75–80 కిలోల బరువు విభాగాల్లో స్వర్ణ పతకాలు కై వసం చేసుకున్నారు. డి.శ్రావణి 70–75 కిలోల బరువు విభాగంలో కాంస్య పతకం సాధించారు. తులసి ధర్మచరణ్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన బాలికలు ప్రతిభ కనబరిచి, అండర్‌–17 బాలికల విభాగంలో గుంటూరు జిల్లాను రన్నరప్‌గా నిలపడం గర్వకారణమన్నారు. క్రీడాకారులు పట్టుదలతో సాధన కొనసాగిస్తూ మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా శాప్‌ బాక్సింగ్‌ కోచ్‌ రామిశెట్టి విశ్వనాథ్‌, సీనియర్‌ బాక్సింగ్‌ క్రీడాకారుడు, న్యాయవాది జి.సతీష్‌ పాల్గొని పతక విజేతలను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement