న్యూస్‌రీల్
నేతలపై కేసులకు ప్రాధాన్యం
సాగర్ నీటి మట్టం
పులిచింతల సమాచారం
నిమ్మకాయల ధరలు
గుంటూరు
గురువారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
● పోలీసులకు సవాలు
విసురుతున్న దొంగలు
● పోక్సో కోర్టులోకి చొరబడి
మరీ దొంగతనం
● సీసీఎస్ స్టేషన్ ఆవరణలోని
ఆలయంలోనే హుండీ చోరీ
● గతంలోనూ మహిళలను
హతమార్చి దోపిడీలు
● వరుస నేరాలతో దిగజారుతున్న
పోలీసు శాఖ పనితీరు
● ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులకే
పరిమితమైన వ్యవస్థ
7
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లా పోక్సో కోర్టులోనే దొంగతనం చేయడం ప్రస్తుత పోలీసుల వ్యవస్థ తీరుకు అద్దం పడుతోంది. దుండగుడు అంతటితో ఆగకుండా, నేరగాళ్లను పట్టుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న మహంకాళి అమ్మవారి దేవాలయం హుండీని సైతం ఎత్తుకెళ్లి పోలీసులకే సవాల్ విసిరాడు. గుంటూరు నగరం నడిబొడ్డున ఐజీ, ఎస్పీ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న పోక్సో కోర్టు, సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఆవరణంలోని దేవాలయంలో చోరీలు జరగడం చూస్తుంటే పోలీసు శాఖ పేరు దిగజార్చే విధంగా ఈ ఘటనలు ఉన్నాయని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. కోర్టులకు, పోలీస్ స్టేషన్‌లకు సైతం రక్షణ లేని పరిస్థితి దాపురించిందంటే ఇక మా పరిస్థితి ఏంటంటూ నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. తాడికొండలో దొంగతనం చేసిన వ్యక్తి నుంచి రూ.10 వేలు తీసుకున్నాడనే నెపంతో చీకటి గోపి అనే యువకుడిని పోలీస్ స్టేషన్‌కు పిలిచి, డబ్బు వెనక్కు ఇవ్వాలంటూ చిత్రహింసలకు గురిచేసిన పోలీసులు... పెద్ద దోపిడీల్లో దొంగలు దొరికినా పూర్తి స్థాయిలో సొమ్ము రికవరీ చూపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండ పట్టణంలో ఏడాది వ్యవధిలో ముగ్గురు మహిళలను హతమార్చి బంగారం దోచుకెళ్లిన ఘటనలు జరిగినప్పటికీ, ఇంకా ఇద్దరు మహిళల హత్య కేసులను పోలీసులు ఛేదించలేని దయనీయ పరిస్థితి దాపురించింది. గుంటూరు నగరంలో సైతం ఇటీవల మహిళలపై దాడులు చేసి బంగారం లాక్కెళ్లిన ఘటనలు అనేకం ఉన్నాయి. దొంగలను పట్టుకుని సొమ్ము రికవరీ చేయాల్సిన పోలీసులే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ఘటనల్లో దొంగలు దొరికినప్పటికీ, పూర్తి స్థాయిలో సొమ్ము రికవరీ చేయకుండా బాధితులకు సగం కూడా రికవరీ సొమ్ము అప్పజెప్పడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతిపక్ష పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి, అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి అక్రమ అరెస్టులు చేయడంపై ఉన్న శ్రద్ధ దొంగతనాలు, దోపిడీలు అరికట్టడంతోపాటు శాంతిభద్రతలను కాపాడడంపై చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని ఇతర రాష్ట్రాల్లో ఉన్నా ఎత్తుకొచ్చే పోలీసులు... దోపిడీలు, దొంగతనాలు జరుగకుండా అరికట్టడం మర్చిపోయారనే ఆరోపణలు వస్తున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా వారిని అరెస్టు చేయడంలో విఫలమవుతున్నారు. ప్రస్తుత పోలీసు శాఖ దృష్టి అసలు విషయాల కంటే కక్షసాధింపుపైనే అధికంగా పెట్టాల్సి రావడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆ శాఖలోని అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని జిల్లాగా ఉన్న గుంటూరు నగరంలోనే కోర్టుల్లో దొంగతనాలు, రోడ్లపై చైన్‌స్నాచింగ్‌లు, ఇళ్లల్లో చోరీలు వంటివి జరుగుతున్నాయంటే పోలీసు శాఖ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే పరిస్థితి ఇలా ఉంటే, మారుమూల ప్రాంతాల్లో ప్రజలు పోలీసులపై ఏ విధంగా భరోసా పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి.
మాచర్ల: నాగార్జున సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ నీటి మట్టం బుధవారం 536.80 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 181 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 28.9587 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కుల నీరు లీకేజీల ద్వారా వెళుతోంది.
తెనాలి: స్థానిక మార్కెట్‌యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.6,500, గరిష్ఠ ధర రూ.9,500, మోడల్ ధర రూ.8 వేల వరకు పలికింది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో దొంగలు, దోపిడీదారులు హల్‌చల్ చేస్తున్నారు. బంగారంతో బయటకు రావాలంటే మహిళలు హడలిపోతున్నారు. ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేస్తూ దోపిడీలకు సైతం తెగబడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముగ్గురు మహిళలను హతమార్చి బంగారం ఎత్తుకెళ్లిన ఘటనలు ఆందోళన రేకెత్తించాయి.


