4న బుర్రిపాలెంలో చంద్రబాబు పర్యటన | - | Sakshi
Sakshi News home page

4న బుర్రిపాలెంలో చంద్రబాబు పర్యటన

Oct 1 2026 4:34 AM | Updated on Oct 1 2026 4:34 AM

4న బుర్రిపాలెంలో చంద్రబాబు పర్యటన

తెనాలిరూరల్‌: రూరల్‌ మండల గ్రామం బుర్రిపాలెంలో 4న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పీఎంఏవై గ్రామీణ్‌ కింద మంజూరైన గృహనిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా బుధవారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సీబారాణి కొర్రపాటి, జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ, కేంద్ర మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఏకే సింగ్‌, జేసీ అశుతోష్‌ శ్రీవాస్తవ సందర్శించారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు హాజరవుతున్న నేపథ్యంలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, ఉప సీఈఓ సీహెచ్‌ కృష్ణ, తెనాలి ఆర్డీఓ కె.శ్రీరమణి, గృహనిర్మాణసంస్థ ప్రాజెక్టు అధికారి జేవీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీరు కె.కళ్యాణచక్రవర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement