న్యూస్‌రీల్
ఎస్‌ఎంసీ ఎన్నికల్లోనూ టీడీపీ నాయకుల జోక్యం వారి సమక్షంలోనే సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక దగ్గరుండి మరీ సంతకాలు చేయించిన అధికార పార్టీ నేతలు కోరం లేకున్నా నిర్భయంగా ఎన్నికలు నిర్వహించిన హెచ్‌ఎం నిబంధనలకు విరుద్ధంగా నిర్ణీత సమయం కంటే ముందే ప్రమాణం
గుంటూరు
బుధవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
పచ్చ మదం..
బడిలోకి రాజకీయం చొరబడింది. ఎస్‌ఎంసీ ఎన్నికలు ఆద్యంతం అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాల నడుమ జరిగాయి. టీడీపీ నేతలే అన్నీ తామై దగ్గరుండి ఎన్నికలు జరిపించారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ సభ్యుల ఎన్నిక మొదలు చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక, సంతకాల తంతు ముగిసే వరకూ పాఠశాలలోనే కూర్చున్నారు. అధికార పార్టీ నాయకుల రాకతో హెచ్‌ఎం నిబంధనలు అమలు చేయాలన్న సంగతిని విస్మరించారు. పచ్చ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.7167 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కుల నీరు లీకేజీల ద్వారా వెళుతోంది.
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎస్‌ఎంసీ ఎన్నికలు జరిగాయి. పాఠశాలలో 160 మంది విద్యార్థులు ఉన్నారు. నిబంధనల ప్రకారం సగం మంది సభ్యులు హాజరు కావాలి. పట్టుమని ముప్‌పై, నలభై మంది కూడా హాజరవ్వలేదు. అయినప్పటికీ అప్పటికే పాఠశాలకు వచ్చిన తెలుగుదేశం నాయకుల ఆదేశాలతో హెచ్‌ఎం విజయ్‌కుమార్ ఎన్నిక నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభ్యుల ఎన్నిక, 1.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక, రెండు గంటలకు ప్రమాణ స్వీకారం, సాయంత్రం 3 నుంచి 3.30 లోపు మొదటి సమావేశాన్ని నిర్వహించాలి. అయితే హెచ్‌ఎం ఈ నిబంధనలేమీ పాటించలేదు. కోరం లేకుండానే ఎన్నికలు జరపడంతో ఎవ్వరైనా వచ్చి ప్రశ్నిస్తారేమోనని మధ్యాహ్నం 12.30 గంటలకే చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక జరిపించారు. అనంతరం ఐదు, పది నిమిషాల వ్యవధిలోనే సంతకాల సేకరణ, ప్రమాణ స్వీకారం చేయించి అధికార పార్టీ నాయకులను మెప్పించారు. మొదటి సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ గ్రూప్ ఫొటోతో సరిపెట్టారు.
అంతా వారి కనుసన్నల్లోనే..
ఎన్నిక ఆద్యంతం స్థానిక టీడీపీ ముఖ్య నాయకుల కనుసన్నల్లోనే జరిగింది. వాస్తవానికి ఎన్నికల సమయంలో విద్యార్థి తల్లిదండ్రులు మినహా మిగిలిన వారు బడిలోనికి ప్రవేశించకూడదు. కానీ ఏకంగా చేతులెత్తి చైర్మన్‌ను ఎన్నుకునే సమయంలో సైతం టీడీపీ నాయకులు హెచ్‌ఎం గదిలో సభ్యుల ఎదుట కూర్చున్నారు. వారి ప్రమాణ స్వీకారం, సంతకాలు కూడా దగ్గరుండి చేయించడం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. ఎన్నిక ముగిసే వరకూ టీడీపీ నాయకులంతా బడి ఆవరణలోనే గుంపులుగా ఉన్నారు. దీనిపై హెచ్‌ఎం విజయ్‌కుమార్‌ను ప్రశ్నించగా కోరం సరిపోయిందని చెప్పారు. డోనర్స్ కింద, ఎక్స్‌అఫీషియో సభ్యుల కింద టీడీపీ నాయకులను అనుమతించామని పేర్కొన్నారు.


