ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

Sep 30 2026 1:46 AM | Updated on Sep 30 2026 1:46 AM

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు రాష్ట్రస్థాయి పోటీలకు మంగళగిరి క్రీడాకారులు ‘ఎవరెస్ట్‌’ శిఖరం వరకు సైకిల్‌ యాత్ర వినాయకునికి సంకటహర చతుర్థి పూజలు

జిల్లా కలెక్టర్‌ ిసీఎం సాయికాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గృహ నిర్మాణ పనులకు అక్టోబర్‌ 4వ తేదీన సీఎం శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ పాల్గొననున్నారని చెప్పారు. హెలిపాడ్‌ ఏర్పాట్లు, రహదారి మరమ్మతులు, వేదిక నిర్మాణం తదితర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఆర్వో షేక్‌ ఖాజావలి, గుంటూరు, తెనాలి ఆర్డీఓలు కె.శ్రీనివాసరావు, కె.శ్రీరమణి, హౌసింగ్‌ పీడీ డైరెక్టర్‌ జె.వి.ఎస్‌.ఆర్‌.కె.ప్రసాద్‌, తెనాలి తహసీల్దార్‌ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మంగళగిరి టౌన్‌: గుంటూరు బీఆర్‌ స్టేడియంలో సోమవారం నిర్వహించిన 70వ స్కూల్‌ గేమ్స్‌ తైక్వాండో అండర్‌–14, అండర్‌–17 బాలబాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో మంగళగిరి అమరావతి తైక్వాండో క్లబ్‌ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు, తైక్వాండో కోచ్‌ దుర్గాప్రసాద్‌ వివరాలు వెల్లడించారు. అండర్‌–14 విభాగంలో జె. లీలామనోహర్‌, ఎస్‌కే దనీష్‌ హుస్సేన్‌, టి.మనస్విని శ్రీ , పి.రాధిక, వి.భువి, అండర్‌–17 విభాగంలో కె.ప్రేమ్‌ రూపేష్‌, జి.హృతి హాసిని, ఎం.గేయ అక్షిత అర్హత సాధించారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలు అక్టోబర్‌ 10 వ తేదీ నుంచి అనంతపురంలో జరగనున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి వినయ్‌కుమార్‌, ఉమ్మడి గుంటూరు జిల్లా తైక్వాండో సంఘం జనరల్‌ సెక్రటరీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

మాచర్ల: విజయపురి సౌత్‌కు చెందిన వ్యక్తి హైదరాబాద్‌ నుంచి ఎవరెస్ట్‌ వరకు సైకిల్‌ యాత్ర చేసి అద్భుతం సృష్టించాడు. నెల క్రితం విజయపురిసౌత్‌కు చెందిన సయ్యద్‌ సిరాజ్‌ హైదరాబాద్‌ నుంచి తన యాత్రను ప్రారంభించాడు. దేశభక్తి, మానవత్వం, సమాన విద్య, అందరికీ వైద్యం, నేపాల్‌తో స్నేహం వంటి సందేశాలతో ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని సొంత ఖర్చుతో యాత్ర పూర్తి చేశారు. కష్టమైన మార్గాల్లో ముందుకు సాగి యాత్రను విజయవంతంగా ముగించారు.

అమరావతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరస్వామి ఉపాలయంలో మంగళవారం సంకట హర చతుర్థ్ధి పూజలను ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి ఆలయ అర్చకుడు జగర్లపూడి శేష సాయిశర్మ మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామి వారికి వివిధ రకాల ఫుష్పాలతో, గరికెతో విశేషాలంకారం చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement